Begin typing your search above and press return to search.
అర్జెంట్ గా ఇంగ్లిషు ట్యూషన్ పెట్టించు బాబు
By: Tupaki Desk | 8 Aug 2015 5:41 AM GMTలోకల్ గా చెలరేగిపోయే మన నేతలు.. ఢిల్లీకి వెళితే మాత్రం తత్తతా.. మమమ్మా అంటూ నంగి.. నంగిగా మాట్లాడే పరిస్థితి. అలా అని ఢిల్లీ వాళ్లు ఏదో పోటుగాళ్లు అని కాదు. వారిలా ఇంగ్లిషు.. హిందీలో మాట్లాడలేని దైన్యం తెలుగు ఎంపీలకు శాపంగా మారింది. తెలుగులో అదరగొట్టే ఏపీ ఎంపీలు.. నోరు తెరిచి ఇంగ్లిషులో నాలుగు అచ్చరం ముక్కలు మాట్లాడాలంటే సినిమానే.
పేరుకు పెద్ద జాబితాగా కనిపించే ఏపీ ఎంపీల లిస్ట్ లో సరిగ్గా ఇంగ్లిషులో గడగడా మాట్లాడే తెలుగు ఎంపీలు ఎంతమందంటే చేత్తో లెక్కేసుకునే దుస్థితి. మిగిలిన వారంతా ఇంగ్లిషులో పూర్ కావటంతో.. ఢిల్లీలో.. మరి ముఖ్యంగా పార్లమెంటులో ఏదైనా విషయంపై మాట్లాడలేని పరిస్థితి.
అదే సమయంలో.. తెలంగాణ ఎంపీలకు పెద్ద ఇబ్బందుల్లేవని చెబుతారు. ఏపీ ఎంపీలతో పోలిస్తే.. తెలంగాణ ఎంపీల్లో ఎక్కువ మంది ఇంగ్లిష్ లో బాగా మాట్లాడటతో పాటు.. మిగిలిన వారు ఇంగిలిపీసు రాకున్నా.. హిందీలో అదరగొట్టే సౌలభ్యం ఉండటంతో వారు.. తాము చెప్పాలనుకున్న మాటల్ని బలంగా చెప్పేయ గలుగుతున్నారు. కానీ.. ఏపీ ఎంపీలకే ఇబ్బందులన్నీ.
ఏపీ ఎంపీల్లో ఇంగ్లిషులో మాట్లాడే నేతలు ఎవరని చూస్తే.. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు.. సుజనా చౌదరి.. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకలు మాత్రమే. సీఎం రమేష్.. అవంతి శ్రీనివాస్ లాంటి నేతలు ఉన్నా.. వారు భాషతో మేనేజ్ చేయగలరే కానీ.. మేజిక్ చేసేంత సీన్ లేదు. భాషతో మేజిక్ చేసే సీన్ ఏపీ ఎంపీలతో పోలిస్తే.. తెలంగాణ ఎంపీలు సో బెటర్. వారిలో వినోద్ కుమార్.. కవిత.. నరసయ్యగౌడ్ లాంటి నేతలు చాలామందే ఉన్నారు.
ఏపీ నేతలతో పోలిస్తే.. అంశాల పట్ల అవగాహన.. వాదనా పటిమ.. తాము మాట్లాడే అంశంపై పక్కాగా ప్రిపేర్ అయి రావటంతో వారి వాదన ప్రభావవంతంగా కనిపించే పరిస్థితి. ఏపీ ఎంపీల్లో అలాంటిది కనిపించదని చెబుతారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. వీలైనంత త్వరగా.. ఏపీ ఎంపీలకు ఇంగ్లిషు ట్యూషన్ పెట్టించటమో.. లేదంటే.. ఇంగ్లిషు భాషా నైపుణ్యం పెరిగేలా కసరత్తు చేయాల్సిందే. లేని పక్షంలో ఏపీ వాదన పార్లమెంటులో ప్రభావవంతంగా వినిపించే అవకాశం లేదని చెబుతున్నారు. మరి.. బాబుకు ఈ మాటలు వినిపిస్తున్నాయో.. లేదో..?