Begin typing your search above and press return to search.

కోడిపందాల సాక్షిగా జేసీ హ‌ల్ చ‌ల్‌

By:  Tupaki Desk   |   14 Jan 2017 6:41 AM GMT
కోడిపందాల సాక్షిగా జేసీ హ‌ల్ చ‌ల్‌
X
ఇటీవ‌లి కాలంలో ప‌త్రిక‌ల్లో పతాక శీర్షిక‌ల్లో ఉండేందుకు తెగ ప్రాధాన్యం ఇస్తున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మ‌రోమారు అదే రీతిలో హ‌ల్ చ‌ల్ చేశారు. కృష్ణా కలిదిండి మండలం తాడినాడలో నిర్వ‌హించిన‌ కోడి పందాల్లో స‌హ‌చ‌ర ఎంపీ మాగంటిబాబుతో క‌లిసి జేసీ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్‌ జగన్ అసలైన రెడ్డీ కాదని విమ‌ర్శించారు. తానే రెడ్డినని చెప్పారు. సీమకు నీరు ఇస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని జేసీ అన్నారు. జేసీ స్వయంగా కోడి పందాలకు రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. దివాకర్‌ రెడ్డిని ఉద్దేశించి ఆయన అభిమానులు ‘రామలసీమ పులిబిడ్డ’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు

ఇదిలాఉండ‌గా...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - న్యాయస్థానాలను గౌరవిస్తూ సంక్రాంతి పండుగకు కోడి పందాలకు బదులు ‘కోళ్ల కుస్తీ పోటీలు’ నిర్వహిస్తున్నామని బీజేపీ నేత కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. ‘ఇద్దరు మనుషులు తలపడితే కుస్తీ అంటున్నారు.. దానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది... గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ - తృతీయ బహుమతులు అందిస్తున్నారు... అదే మాదిరిగా కోళ్ల కుస్తీ పోటీలు నిర్వహించి, గెలిచిన కోళ్లకు బహుమతులు అందిస్తాం' అని అన్నారు. కోడిపందాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 1974 గేమింగ్ యాక్టు ఉందని, దాన్ని అందరూ గౌరవించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 1960 యానిమల్ క్రూయల్ యాక్టు ఉందని, దీని ప్రకారం హింసకు తావులేకుండా పందాలు వేసుకోవాలని ర‌ఘురామ కృష్ణంరాజు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/