Begin typing your search above and press return to search.
దేశం ఎంపీ సిట్టింగులకు నో ఛాన్స్!
By: Tupaki Desk | 3 Jan 2019 2:30 PM GMTఆంధ్రప్రదేశ్ శాసనసభ - లోక్ సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందా..! కొందరు సిట్టింగ్ శాసన సభ్యులు - లోక్ సభ సభ్యులకు టిక్కెట్లు నిరాకరించనుందా..?
అటువారిని ఇటు - ఇటువారిని అటు మార్చనుందా...? కొందరు సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టాలనుకుంటోందా..?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే శాసన సభ్యులలో చాలా మందిని మారుస్తామంటూ తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్మగర్భంగా చెబుతున్నారు. ఇక లోక్ సభ సభ్యుల విషయానికి వస్తే సిట్టింగులలో చాలా మందికి ఈసారి టిక్కెట్టు దక్కవంటున్నారు. ఎంపీలలో కొందరిని ముఖ్యంగా యువకులను శాసనసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. గడచిన నాలుగున్నర ఏళ్లలో లోక్ సభలో పనితీరు - నియోజకవర్గాలలో ఎంపీల వ్యవహార శైలి అంచనా వేసి అందుకు అనుగుణంగా టిక్కెట్టు ఇస్తారంటున్నారు.
తెలుగుదేశం లోక్ సభ సభ్యులలో ఐదారుగురిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. వీరిలో తిరుపతి ఎంపీ శివప్రసాద్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. తన కుమార్తె విషయంలో శివప్రసాద్ తెలుగుదేశం పార్టీని - ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు. లోక్ సభలో ప్రత్యేక హోదా అంశంపై పగటి వేషదారులలా రోజుకో వేషం వేసుకుని వచ్చిన శివప్రసాద్ తన ఇమేజీని పెంచుకున్నారేమో కాని పార్టీకి ఉపయోగపడలేదన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా చెబుతున్నారు. దీంతో శివప్రసాద్ కు రానున్న ఎన్నికలలో టిక్కెట్టు దక్కె అవకాశాలు తక్కువే అంటున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం లోక్ సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప కూడా అధిష్టానం దగ్గర వ్యతిరేకతను మూటకట్టుకున్నారంటున్నారు. ఈ నాలుగున్నారేళ్లలో ఆయన పనితీరు ఏమాత్రం బాగోలేదని అంతరంగిక సర్వేలలో వెల్లడైనట్టు చెబుతున్నారు. మరోవైపు తన వియ్యంకుడు హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలక్రిష్ణను లోక్ సభకు పంపాలని చంద్రబాబు ఆలోచన. దీంతో నిమ్మల కిష్టప్పకు ఎంపీ టిక్కెట్టు దక్కే అవకాశాలు లేవంటున్నారు. అలాగే అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాలో ప్రజాప్రతినిధులు - నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయనకు టిక్కెట్టు దక్కే అవకాశం లేదంటున్నారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నానికి కూడా టిక్కెట్టు దక్కే అవకాశాలు లేవంటున్నారు. విజయవాడ రవాణ శాఖ అధికారులతో కేశినేని నాని వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం తెచ్చింది. దీంతో ఆయనకు టిక్కెట్టు దక్కె అవకాశం లేదంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు ఈసారి కొత్త ముఖాలే ఎక్కువగా కనిపిస్తాయని ప్రచారం జరుగుతోంది.