Begin typing your search above and press return to search.
చంద్రబాబును రాజ్ నాథ్ డైవర్ట్ చేశారా
By: Tupaki Desk | 5 Feb 2018 2:47 PM GMTబీజేపీతో అమీతుమీ తేల్చుకుంటామంటూ హడావుడి చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును బుజ్జగించే పనిని రాజ్ నాథ్ సింగ్ కు అప్పగించారు. 2014 తరువాత ఇంతవరకు కేంద్రంతో డీలింగ్ అంటే అది నేరుగా మోదీతో కానీ - లేదంటే పార్టీపరంగా వెళ్తే అమిత్ షాతో కానీ జరుగుతోంది. ఒక్కోసారి జైట్లీ కూడా చంద్రబాబుతో ఏపీ వ్యవహారాలను డీల్ చేస్తున్నారు. కానీ.. చంద్రబాబు తాజా తిరుగుబాటు తరువాత అమిత్ షా కానీ - జైట్లీ కానీ - మోదీ కానీ చంద్రబాబుతో టచ్ లోకి రాలేదు. ఎప్పుడూ లేనిది హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి అప్పటికప్పుడు ఆయన్ను చల్లబర్చారు. ఇప్పుడు తాజాగా ఏపీ టీడీపీ ఎంపీలతో ఆయన భేటీ కూడా అయ్యారు. దీంతో టీడీపీ - బీజేపీ పెటాకుల వ్యవహారం పరిష్కారానికి రాజ్ నాథ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అయితే.. టీడీపీ ఎంపీలకు రాజ్ నాథ్ ఏం చెప్పారో ఏమో కానీ, ఆయన్ను కలిసిన తరువాత ఒక్కరు ఒక్క మాట కూడా ఆడకుండా మీడియా వైపు చూడకుండా వెళ్లిపోవడంతో దిల్లీ వర్గాల్లో సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతవరకు ఏపీ వ్యవహారాల్లో వేలు పెట్టని పెద్ద మనిషితో చంద్రబాబుకు ఫోన్ చేయించి అప్పటికప్పుడు చల్లార్చడమే బీజేపీ వ్యూహమని.. ఆ వ్యూహానికి పడిపోయిన చంద్రబాబు వెనక్కు తగ్గారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
రాజ్ నాథ్ సింగ్ టీడీపీ ఎంపీలతో సుమారు 20 నిమిషాలు భేటీ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో విభజన హామీలు, బడ్జెట్ కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలపై రాజ్ నాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ సమస్యలన్నిటినీ నివేదిక రూపంలో ఎంపీలు అందజేయగా , ఆయన పరిశీలించారని.. అయితే, అధికారులు అందుబాటులో లేకపోవడంతో మరోసారి వీటిపై చర్చిద్దామని చెప్పి ఎంపీలను రాజ్ నాథ్ పంపించివేశారు.
అయితే.. మొన్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగినప్పుడు హడావుడిగా చంద్రబాబుతో మాట్లాడిన ఆయన ఇప్పుడు తనను కలిసిన టీడీపీ ఎంపీలతో తరువాత చూద్దాం అన్నట్లుగా వ్యవహరించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. నిన్నటికి నిన్న అంత హడావుడి చేసి చప్పున చల్లారిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు తూచ్ అనలేని పరిస్థితి కల్పించినట్లుగా తెలుస్తోంది. రాజ్ నాథ్ వద్ద ఏం జరిగిందన్నది చంద్రబాబుకు వివరించాక టీడీపీ మళ్లీ వైఖరిని ప్రకటిస్తుందని భావిస్తున్నారు.