Begin typing your search above and press return to search.

ఎంపీల‌తో మోడీ భేటీ...బాబుకు తీపిక‌బురు

By:  Tupaki Desk   |   5 Jan 2018 1:25 PM GMT
ఎంపీల‌తో మోడీ భేటీ...బాబుకు తీపిక‌బురు
X
ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో- అటు మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మైతే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిరీక్ష‌ణ ఫ‌లించింది! ఢిల్లీ కేంద్రంగా ఆయ‌న సాగిస్తున్న ఆకాంక్ష స‌ఫ‌లం అయింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆ తీపిక‌బురు అందించారు. ఇంత‌కీ ఆ తీపిక‌బురు ఏంటి? పెద్ద ఎత్తున స‌స్పెన్స్‌ కు కార‌ణ‌మైన పోల‌వ‌రం నిధులా...లేక‌పోతే...ప్ర‌త్యేక హోదాపై తీపిక‌బురా అని ఆలోచించ‌కండి. త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబును క‌ల‌వ‌నున్న‌ట్లు చంద్ర‌బాబు వెల్ల‌డించారు!

ఔను. ఇదే తీపి క‌బురు. గ‌త కొద్ది నెల‌లుగా ఇటు మీడియాలో.... అటు రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్ర‌చారం తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు ఆపాయింట్‌ మెంట్ ఇవ్వ‌డం లేద‌నేది స్థూలంగా ఈ చ‌ర్చ‌ల టాక్‌. అయితే తాజాగా ఈ చ‌ర్చ‌కు స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ చెక్ పెట్టారు. ఆంద్రప్రదేశ్‌ కు చెందిన టీడీపీ ఎంపీలు ఈరోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీని ఢిల్లీలో కలిశారు. ఆంద్రప్రదేశ్‌ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం చేసే సహాయం మరియు రైల్వే జోన్ కేటాయించినందుకు కృతజ్ఞత తెలిపారు. టీడీపీ ఎంపీలు మరియ కేంద్రమంత్రులు సుజనాచౌదరి - అశోకగజపతిరాజుతో పాటు పార్టీ ఎంపీలు ఈ భేటీలో ఉన్నారు.

ఈ స‌మావేశం అనంతరం కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి మీడియాతో మాట్లాడుతూ త్వ‌ర‌లో చంద్రబాబు - నేను కలుస్తున్నాం అని ప్రధాని మోడీ ఎంపీలకు చెప్పినట్లు వివ‌రించారు. ` 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నేను కలుస్తాను. మేమిద్దరం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పెండింగ్‌ అంశాలు అన్నింటిని చర్చించి ఏపీకి ఎలా న్యాయం చేయాలో చేస్తామని ప్ర‌ధాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కి సహాయం చేయటానికి అన్ని వేళలా నేను కృషి చేస్తాను` అని మోడీ చెప్పినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ రాష్ట్ర విభ‌జ‌న‌పై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశార‌ని కేంద్ర మంత్రి అన్నారు. `అప్పుడే రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచిపోయాయా అని ప్ర‌ధాని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. పోలవరం విషయంలో అసలు ఇబ్బందులు ఏమీ లేకుండా చేస్తున్నాం.` అని అన్నారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఏపీలో కాక పుట్టిన నేపథ్యం ఓవైపు..టీడీపీ ప్ర‌య‌త్న లోపం అంటూ విప‌క్షాలు మ‌రోవైపు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న స‌మ‌యంలో... టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రి మోడీతో భేటీ అవ‌డం గ‌మ‌నార్హం. ఇదే భేటీలో బాబుతో భేటీ గురించి చెప్ప‌డం కూడా విశేషం.