Begin typing your search above and press return to search.

బాబు నిల‌దీయ‌మంటే త‌మ్ముళ్లు అలా చేశారు

By:  Tupaki Desk   |   27 March 2018 8:24 AM GMT
బాబు నిల‌దీయ‌మంటే త‌మ్ముళ్లు అలా చేశారు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును మీడియా పులిగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. బాబుకున్న బ‌ల‌మైన ఆస్తి.. ఆయ‌న అనుకూల మీడియాగా ప‌లువురు అభివ‌ర్ణిస్తుంటారు. ఆయ‌న వ్యూహాల్ని అబ్బో అని పొగిడేయ‌టం.. ఆయ‌న‌కు ర‌క్ష‌గా నిల‌వ‌టం.. త‌ప్పు చేసిన‌ప్పుడు ర‌క్ష‌గా నిల‌వ‌టం చేస్తుంటారని చెబుతారు. ఈ కార‌ణంతోనే బాబును మ‌హా తెలివైనోడిగా.. వ్యూహ నిపుణుడిగా అభివ‌ర్ణిస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌న్న నిర్ణ‌యం తీసుకున్న ఏపీ అధికార‌ప‌క్షం.. కొన్ని రోజులుగా అవిశ్వాసం పెడుతోంది. అయితే.. స‌భ వాయిదా ప‌డ‌ట‌తో అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాలేదు. ఈ రోజు ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ తో పాటు.. టీడీపీ స‌హా దాదాపు ఐదారు పార్టీలు ఏపీ ప్ర‌త్యేక హోదా అంశంపై మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. ఈ నేప‌థ్యంలో ఈ రోజు లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

దీనికి తోడు ఈ రోజు స‌భ‌కు ప్ర‌ధాని మోడీ హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌వారం స‌భ‌లోకి వ‌చ్చే అవిశ్వాస తీర్మానం చ‌ర్చ సంద‌ర్భంగా ఏమేం చేయాలి? అన్న అంశంపై ఇప్ప‌టికే చంద్ర‌బాబు దిశానిర్దేశం చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. నిప్పుతో చెల‌గాట‌మా అని గ‌ట్టిగా చెప్ప‌ట‌మే కాదు.. మోడీని నిల‌దీయాల‌ని.. తానంటే ఏమిటో ప్ర‌ధానికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌న్నట్లుగా వార్త‌లు కొన్ని మీడియాల‌లో వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అందుకు రివ‌ర్స్ సీన్ ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది.

ఈ రోజు పార్ల‌మెంటుకు వ‌చ్చిన ప్ర‌ధాని.. ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీతో క‌లిసి స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్న స‌మ‌యంలో టీడీపీ ఎంపీలు సుజ‌నా.. సీఎం ర‌మేశ్‌ లు అటుగా వెళ్లారు. ఆ సంద‌ర్భంగా అక్క‌డున్న మోడీ.. జైట్లీలో సుజ‌నా.. సీఎం ర‌మేశ్ మాట్లాడే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా జైట్లీ చేతులు ప‌ట్టుకున్న సుజ‌నా.. ఏవేవో చెప్ప‌టం క‌నిపించింది.

ప్ర‌ధాని మోడీకి సైతం న‌మ‌స్కారం పెట్టారు. ఇది జ‌ర‌గ‌టానికి కొద్ది గంట‌ల ముందు టీడీపీ ఎంపీల‌తో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. అవిశ్వాస తీర్మానం స‌భ‌లో వ‌చ్చిన‌ప్పుడు మాత్రం కేంద్రంపై ఎదురుదాడికి దిగాల‌ని నిర్ణ‌యించారు. త‌న‌కున్న రాజ‌కీయ అనుభ‌వం గురించి ప్రస్తావించాల‌న్న‌ట్లుగా వార్త‌లు ఛాన‌ళ్ల‌లో వ‌చ్చాయి. ఇది జ‌రిగిన కాసేప‌టికే స‌భ‌లో మోడీ.. జైట్లీల‌తో మాట్లాడుతున్న తెలుగు త‌మ్ముళ్ల తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.