Begin typing your search above and press return to search.
పచ్చ ఎంపీల్లారా..మీ సంకుచితత్వమే ముంచుతోంది
By: Tupaki Desk | 2 March 2018 3:30 PM GMTప్రస్తుతం ఉన్న సంక్లిష్ట సమయంలో.. రాష్ట్ర ప్రయోజనాలు గంగలో కలుస్తున్న వేళ.. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక తీరుగా రాష్ట్రం కోసం పోరాడాలని అనుకుంటోంది. బలం ఉన్న వాళ్లు తమకు రాజకీయ ప్రయోజనం కూడా ఉండాలని కోరుకోవడం సహజం. బలం లేనివాళ్లు.. కనీసం తమ వల్ల మంచి పని జరగాలనే ఉద్దేశంతోనైనా.. మొత్తానికి ప్రతి ఒక్కరూ రాష్ట్రం గురించి, ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది.
తెలుగుదేశం పార్టీ ఆలస్యంగా మేలుకున్నప్పటికీ.. ప్రత్యేకహోదా అనే డిమాండ్ కు ఇన్నాళ్లుగా తాము చేసిన ద్రోహాన్ని వారే గుర్తెరిగారు. అయితే ఆ విషయం ఒప్పుకోకుండా.. ఒకవైపు బుకాయిస్తూనే మరోవైపు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాలనే డిమాండ్ ను తామే కనిపెట్టినంత డాబుసరిగా ఇప్పుడు దానికోసం పోరాడుతాం అంటున్నారు.
శుక్రవారం నాడు ఎంపీలతో సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుమీద దిశానిర్దేశం చేసిన పిమ్మట పరిస్థితి మొత్తం మారింది. పోరాడి సాధిస్తాం .. అని కొన్ని రోజులుగా చంద్రబాబు డాబుగా ప్రకటనలు చేస్తుండడంతో.. అమీ తుమీ తేలిపోతుందని ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ సమావేశంలో చంద్రబాబు చేసిన మార్గనిర్దేశనం చప్పగా ముగిసింది.
5వ తేదీనుంచి పార్లమెంటు మొదలు కానున్న నేపథ్యంలో.. తాము వ్యూహాత్మకంగా ముందుకు పోతాం అంటున్న తెదేపా ఎంపీలు.. ఏం చేసేది మాత్రం ముందుగా చెప్పరట. ‘చెబితే వాళ్లు (వైసీపీ) జాగ్రత్త పడిపోతారు’ అని ఎంపీ రామ్మోహన నాయుడు చెప్పడం చూస్తోంటే.. మరీ ఇంత సంకుచితంగా ఆలోచించే ఈ ఎంపీలు రాష్ట్రం కోసం ఏం సాధిస్తారా? అనే సందేహం కలుగుతోంది.
ఇప్పుడున్న సమయంలో ఏ పార్టీ అయినా రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ప్రయత్నించాలి. వైసీపీ తమ కార్యాచరణను స్పష్టంగా తేదీలతో సహా ప్రకటించింది. వారు కూడా తెదేపా జాగ్రత్త పడుతుంది అని ముసుగులో ఉంచుకుంటే.. ఈ పాటి ఒత్తిడి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు తెదేపా వాళ్లు చెబుతున్న మాటలు చూస్తోంటే.. వైసీపీకి మైలేజీ రాకుండా ఉండడానికి పోరాడుతున్నట్లుగా ఉన్నది తప్ప.. రాష్ట్రం కోసం హోదా సాధించడానికి పోరాడుతున్నట్లుగా లేదని.. పలువురు ఆరోపిస్తున్నారు.
అయినా వారి మాటలను బట్టి తేలుతున్నదేంటంటే.. అసలు తెదేపా వద్ద పోరాటానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ లేదని.. వారు ఇప్పటికీ కమలదళంతో అంటకాగుతూ.. స్వార్థప్రయోజనాలను నెరవేర్చుకోవడానికే చూస్తున్నారని.. పైకి మా ప్లాన్ బయటపెట్టం అంటూ లేనిదాని గురించి బుకాయిస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు.