Begin typing your search above and press return to search.
తమ్ముళ్ల నోట మోడీ ద్రోహం మాట వచ్చేసింది
By: Tupaki Desk | 21 March 2018 8:45 AM GMTఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గకుండా చేస్తున్న పోరాటాలు తెలుగు తమ్ముళ్లను ఆ బాట పట్టేలా చేశాయన్నది తెలిసిందే. హోదా సాధన డిమాండ్ తో మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిన జగన్ పార్టీ ఎంపీల తీరుతో.. తెలుగు తమ్ముళ్లు తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. గడిచిన వారం వ్యవధిలో అవిశ్వాస తీర్మానం కోసం లోక్ సభలో పెట్టటం.. అది టేబుల్ మీదకు రావటం.. దానిపై చర్చ జరకుండా వాయిదా పడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ ఎంపీలు.. సభలో చర్చ జరగకుండా వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్న కొత్త విషయం జాతీయ మీడియా ఛానల్ ఒకటి బయపెట్టటంతో తెలుగు తమ్ముళ్లు డిఫెన్స్ లో పడిపోయారు. తమ తప్పును కవర్ చేయాలనుకున్నారో ఏమో కానీ.. ఎప్పుడూ లేని రీతిలో ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ తమ్ముళ్లు.
రాజకీయంగా ప్రత్యర్థుల కంటే మరింత మైలేజీ పొందాలన్న ఆలోచనలో ఉన్న ఏపీ టీడీపీ ఎంపీలు ఈ రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా.. ప్రధాని నుంచి స్పందనే రావటం లేదన్నారు. తమకు ఇంత నమ్మకద్రోహం చేస్తారని తాము అనుకోలేదన్నారు.
తెలుగు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని.. విభజన వేళ కాంగ్రెస్ చేసిన తప్పే ఈ రోజు బీజేపీ నేతలు చేస్తున్నారన్నారు. తాము అవిశ్వాస తీర్మానాన్ని సభలో పెట్టినప్పటికీ.. సభలో ఏదో కారణంపై టీఆర్ ఎస్.. అన్నాడీఎంకే నేతలు ఆందోళన చేస్తూ.. సభ సాగకుండా చేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు.. రాజధాని ప్రహరీ గోడకు సరిపోతాయన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి.. దీనికి బీజేపీ నేతల కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి.