Begin typing your search above and press return to search.
ఏంటి కథ : బడ్జెట్ మాటెత్తకుండా పోరాటమా?
By: Tupaki Desk | 6 Feb 2018 4:42 AM GMTసోమవారం ఉదయం నుంచి ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు నిరసన ప్రదర్శనలు ప్రారంభించేశారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేస్తున్నారు. మంత్రులతో భేటీ అయిపోతున్నారు.. రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించేయబోతున్నారు.... అంటూ రకరకాల వార్తలతో టీవీ ఛానెళ్లు మొత్తం ఊదరగొట్టేశాయి. కాస్త కుదురుగా ఆలోచిస్తూ.. ఢిల్లీలో తెదేపా నిరసనలకు సంబంధించి.. పత్రికల్లో ఫోటోలు కూడా ప్రచురితం అయిన తర్వాత వాటన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. పార్లమెంటు ఎదుట ఉన్న గాంధీ బొమ్మ వద్ద తెలుగుదేశం ఎంపీలు కొందరు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేసింది నిజమే. ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మాట నిజమే. కానీ ఆ ప్లకార్డుల్లో ఏం రాసి ఉన్నదో కూడా గమనించండి.
‘‘సేవ్ ఆంధ్రప్రదేశ్ నౌ - ఫాలో అలియన్స్ ధర్మ నౌ - కీప్ యువర్ ప్రామిసెస్ - ఇంప్లిమెంట్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కమిట్ మెంట్స్ నౌ’’ ఇలాంటి రాతలు తప్ప.. బడ్జెట్ లో అన్యాయం జరిగింది. కేటాయింపులు కావాలి.. అనే పదాలు ఎక్కడా లేవు.
తెలుగుదేశం పార్టీ ఎంత డొంకతిరుగుడు పోరాటాన్ని సాగిస్తున్నదో.. మేం పోరాడేస్తున్నాం అనే బిల్డప్ తో ఇక్కడి ఏపీ ప్రజల వద్ద మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తూ,.. ఎబ్బెబ్బే మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ఎలాంటి పోరాటమూ చేయడం లేదు అని కేంద్రంలోని భాజపా వద్ద ముఖప్రీతి డైలాగులు వేయడానికి అవసరమైన వెసులుబాటును కాపాడుకుంటూ.. ఇలాంటి మాయోపాయ ఉద్యమాలు నడుపుతున్నది.
అచ్చంగా తెలుగుదేశం ఎపీలు సోమవారం ఢిల్లీలో రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభించారు అని ప్రజలు అనుకుంటే భ్రమే. ఎందుకంటే.. వారు స్పష్టంగా విభజన చట్టం హామీలు అనే మాట గురించి ప్రస్తావిస్తున్నారే తప్ప.. ప్రస్తుతం ఉన్న తక్షణ అన్యాయం ఏమిటో దాన్ని గురించి నోరెత్తడానికి కూడా సాహసించడం లేదు. కడుపుచించుకుంటే కాళ్లమీదే పడుతుందన్నట్లుగా.. బడ్జెట్ కేటాయింపుల మాటెత్తితే తమ ప్రభుత్వ లోపాలే బయటపడతాయని వారు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక్కటంటే ఒక్క వ్యవహారానికి కూడా ఇప్పటిదాకా నిర్దిష్టమైన డీపీఆర్ లు తయారుచేయకుండానే.. నిధుల గురించి అడిగితే.. తామే నవ్వులపాలవుతామని వారు గ్రహించినట్లుంది. అందుకే అటు భాజాపాకు కోపం రాకుండా బడ్జెట్ ను అడగని ధర్నాలు చేస్తూ - ఇటు ప్రజలను బురిడీ కొట్టిస్తూ ఎంపీలు రోజులు నెట్టేస్తున్నారని విశ్లేషకులు అనుకుంటున్నారు.