Begin typing your search above and press return to search.

కొడాలికి కొత్త మొగుడు.. చంద్ర‌బాబు వ్యూహం ఇదే!

By:  Tupaki Desk   |   1 May 2022 1:30 AM GMT
కొడాలికి కొత్త మొగుడు.. చంద్ర‌బాబు వ్యూహం ఇదే!
X
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి, గుడివాడ అడ్డాలో వ‌రుస విజ‌యాలు సాధించి..కాల‌ర్ ఎగ‌రేస్తున్న కొడాలి నానికి .. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో చెక్ పెట్ట‌నున్నారా? ఇక్క‌డ నుంచి వ్యూహాత్మ‌కంగా.. యువ నేత‌కు టికెట్ ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి.. టీడీపీ వ‌ర్గాలు. దాదాపు 2004 త‌ర్వ‌త నుంచి ఇక్క‌డ టీడీపీ ప్రాతినిధ్యం లేద‌నే చెప్పాలి. అప్ప‌ట్లో కొడాలికి అవ‌కాశం ఇచ్చిన చంద్ర‌బాబు త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీకి దూర‌మ‌య్యారు. అంతేకాదు.. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా.. చంద్ర‌బాబుపైనా.. ఆయ‌న కుమారుడిపైనా విరుచుకుప‌డుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు చెక్ పెట్టాల‌ని.. చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌కు చెందిన దేవినేని నెహ్రూవార‌సుడు దేవినేని అవినాష్‌కు అక్క‌డ టికెట్ ఇచ్చారు. హోరా హోరీ పోరు కూడా సాగింది. అయితే.. కొడాలే గెలిచారు. దీనికి దేవినేని అవినాష్ స్థానికుడు కాద‌నే ఒక విష ప్ర‌చారం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఈ ద‌ఫా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌త్తిలాంటి యువ‌కుడిని ఇక్క‌డ నుంచి బ‌రిలో దింపాల‌ని.. చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఆయ‌నే శిష్ట్లా లోహిత్‌. బ్రాహ్మ‌ణ సామాజిక‌వ ర్గానికి చెందిన స్థానికుడు.

ఇప్ప‌టికే లోహిత్‌ను హైలెట్ చేసేందుకు పార్టీ ఐ-టీడీపీ విభాగం చ‌ర్య‌లు ప్రారంభించింది. త‌న‌ను ఓడించే టీడీపీ నాయ‌కుడు ఇప్ప‌టి వ‌ర‌కు పుట్ట‌లేద‌ని అంటున్న కొడాలి నానికి ఖ‌చ్చితంగా చెక్ పెట్టాల‌నే వ్యూహంతో లోహిత్‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల నున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించార‌ని.. పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. శిష్ట్లా లోహిత్‌ యువ నాయ‌కుడు బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్న‌త విద్యావంతుడు.

ఇక‌, లోహిత్ ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త‌కాదు. ఆయ‌న తండ్రి గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో జ‌కీయాలు చేశారు. పైగా ఆద‌ర్శ‌నేత‌గా కూడా ఆయ‌న‌కు పేరు ఉంది. పైగా గుడివాడ అగ్ర‌హారంలో ఈ కుటుంబానికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంద‌ని చెబుతున్నారు. లోహిత్ ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ స‌హా.. ప‌లు వ్యాపారాల్లో మంచి ఫాంలో ఉన్నారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతోపాటు.. త‌న సామాజిక‌వర్గంలోను.. వ్యాపార ప‌రంగా క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ ఆయ‌న మంచి పేరు తెచ్చుకున్నారు.

అంద‌రిలోనూ.. గుర్తింపు కూడా పొందారు. వ‌య‌సు కూడా చాలా చిన్న‌వ‌యసు కావ‌డం గమ‌నార్హం. దీంతో.. లోహిత్‌ను గుడివాడ‌లో నిలబెట్ట‌డం ద్వారా.. డిఫ‌రెంట్ లుక్‌తో రాజ‌కీయాలు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ సాగుతోంది. వాస్త‌వానికి గుడివాడ‌లో టీడీపీకి నాయ‌కులు ఉన్నా.. వారు ప్ర‌జ‌ల్లో మంచి మార్కులు వేయించుకోలేక పోతున్నార‌ని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లుగా ఇక్క‌డ ప‌రాజ‌యం పాల‌వుతూనే ఉంది.

మ‌రికొంద‌రు టీడీపీ నాయ‌కులు ఏకంగా.. కొడాలి వ‌ర్గంతోనే ట‌చ్‌ల ఉన్నార‌నేది చంద్ర‌బాబు కు అందుతున్న ఫిర్యాదుల‌ను బ‌ట్టి తెలుస్తోంది. వీటిని గ‌మనించిన చంద్ర‌బాబు ఇక్క‌డివారిలో పాతుకుపోయిన నేత‌ల‌కు టికెట్ ఇవ్వ‌రాద‌ని.. నిర్ణ‌యించుకున్నారు. అయితే.. వారిని ప‌క్క‌న పెట్ట‌కుండా.. లోహిత్ కు టికెట్ ఇచ్చి.. పార్టీలో కీల‌క ప‌ద‌వుల‌ను పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. వారికి ప్ర‌భుత్వంలోనూ కార్పొరేష‌న్ ప‌ద‌వులు అప్ప‌గించాలని ఆలోచిస్తున్నార‌ట‌.

లోహిత్ అయితే.. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు.. ఎలాంటి ఆరోప‌ణ‌లు లేని సౌమ్యుడు కావ‌డంతో గుడివాడ ప్ర‌జ‌లు రిసీవ్ చేసుకుని.. కొత్త నాయ‌కుడికి.. ప్రాధాన్యం ఇస్తార‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ప‌రోక్షంగా గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చార‌ని.. పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక‌, మేలో జ‌ర‌గ‌నున్న మ‌హానాడులో యువ‌త‌ను స‌మీక‌రించే బాధ్య‌త‌ల‌ను కూడా లోహిత్‌కు అప్ప‌గించార‌ని స‌మాచారం.