Begin typing your search above and press return to search.
లోకేష్‌ను `జాకీ` పెట్టి లేపినా.. లేవడం లేదే..ఏం చేద్దాం!
By: Tupaki Desk | 26 April 2021 3:30 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం.. పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయనను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. ఇదే విషయం.. టీడీపీలోని సీనియర్ల మధ్య కూడా చర్చకు వస్తోంది. ఇక, ఈ చర్చలు ఇలా ఉంటే.. లోకేష్ కూడా తన ఆహార్యంలో చాలా మార్పు తెచ్చుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో వర్కవుట్స్ చేసి సన్నబడ్డారు. డ్రెస్, హెయిర్ స్టయిల్‌మార్చేశారు. మీసాల స్టయల్‌లోనూ మార్పు చేసుకున్నారు. గడ్డం పెంచారు.
ఇలా.. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మాదిరిగా వేషధారణలోనూ మార్పు చేసుకున్నారు. ఇదంతా దేనికోసం అంటే.. ప్రజల మనసులు దోచుకునేందుకే! అయితే, ఇక్కడ ఆయన ఎన్ని అవతారాలు ఎత్తినా.. చంద్రబాబుకు ఉన్నంత ఓపిక లేక పోవడం పెద్ద మైనస్ అయిపోయింది. దీంతో ఈ పరిస్తితి ఇటు పార్టీలోను, అటు ప్రజల్లోనూ ఆయనకు మార్కులు వేయించలేకపోతోంది. ప్రజలను ఆకర్షించకలేకపోతోంది అంటున్నారు.మొన్నామధ్య లోకేష్ మీడియాతో మాట్లాడడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో సాక్షి రిపోర్టర్ ఎక్కడయ్యా? అని ప్రశ్నిచారట.
ఇంతలో అక్కడకు వచ్చిన రిపోర్టర్ `సార్ మీరు ఈ మధ్య తెలుగు బాగా మాట్లాడుతున్నారే!` అని సటైర్ కుమ్మేశాడు. అయితే.. మన లోకేష్‌బాబుకు మాత్రం అది సటైర్ అని తెలియక.. ``నన్ను పొగుడుతన్నావ్. నీ ఉద్యోగం ఊడిపోద్ది చూసుకో!`` అన్నారట. అంటే.. లోకేష్‌కు సటైర్‌కు ప్రశ్నకు తేడా తెలియడం లేదన్న మాట అని గుసగుసలు వినిపించాయి. సాక్షి రిపోర్టర్ సటైర్ వేస్తే.. లోకేష్ తనను పొగుడుతున్నాడను కోవడంపై సీనియర్లు పెదవి విరిచారు. `అరె ఆ మాత్రం అర్ధం చేసుకోలేకపోతే ఎలా?` అనివారు అంటున్నారు.,
దీంతో.. ``మేం లోకేష్‌ను `జాకీ` పెట్టి లేపినా.. లేవకపోతే.. ఏం చేయాలి`` అని తెగ బాధపడుతున్నారట. ఇక, పబ్లిక్ మీటింగులకు వెళ్తే.. లోకేష్ వ్యాఖ్యలకు టీడీపీ నేతలే నవ్విపోతున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు పంచ్ డైలాగులు పేలాల్సిన చోట.. నాటు రైటర్ రాసిన పదాలు నాలికపై పెట్టుకుని `ఏం పీకుతావ్` అంటూ.. వ్యాఖ్యలు సంధిస్తున్నాడు. అయితే.. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ శ్రేణులకు ముద్దుగా ఉంటాయేమో.. కానీ, ప్రజలు కాదని అంటున్నారు. వైసీపీలో కొందరు మంత్రులు ఇలానే నోరు పారేసుకుంటుంటే.. ప్రజలు ఛీ కొడుతున్నారనే విషయాన్ని టీడీపీ సీనియర్లు గుర్తుం చేస్తున్నారు.
లోకేష్ మాట్లాడుతున్నప్పుడు పదాలు వెతుకులాడుతున్నాడని కొందరు అంటున్నారు. కానీ, చంద్రబాబు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని, ఆయన లోకల్‌గా మాట్లాడినా, నేషనల్ మీడియాలో మాట్లాడినా ఎక్కడా తడబడకుండా స్పీచ్‌లు ఇస్తుంటారని.. ఆయన ను చూసైనా లోకేష్ నేర్చుకోవాలని చెబుతున్నారు. కానీ, లోకేష్ మాత్రం కళ్లలో భయం కనిపిస్తోందని, మాటలు కూడా పోగేసుకుని మాట్లాడుతున్నాడని, అందుకే ఆయనకు మాస్‌కు మధ్య గ్యాప్ తగ్గడం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు కూడా ఒప్పుకుంటున్నాయి. సో.. ఈ పరిణామాలను గమనిస్తున్నవారు లోకేష్ ఇంకా ఇంప్రూవ్ కావాలని చెబుతున్నారు. మరి ఎప్పటికి చినబాబు పెద్ద నేత అవుతారో చూడాలి అంటున్నారు సీనియర్లు.