Begin typing your search above and press return to search.
బొత్తిగా ఇలా తయారేంటి బాబూ .. ?
By: Tupaki Desk | 30 Aug 2021 5:30 PM GMTచంద్రబాబు అంటేనే పని రాక్షసుడు అని పేరు. ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతారు అని చెబుతారు కూడా ఆయన తొలిసారి సీఎం అయినపుడు ఒక స్లోగన్ కూడా వినిపించేది. తాను నిద్రపోనూ, ఎవరినీ నిద్రపోనీయను అని. అలాగే చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా తొమ్మిదేళ్ల పాటు పాలించారు. చంద్రబాబుకు ఎంత ఓపిక అన్నది నాడు ఆయన వద్ద పనిచేసిన అధికారులు కూడా చెప్పేవారు. ఆయన ఒక వైపు సమీక్షలు మరో వైపు టూర్లు, ఇంకో వైపు పార్టీ కార్యక్రమాలు ఇలా ఎక్కడ ఆయన కనిపించినా ముఖంలో అలసట అసలు కనిపీంచేది కాదు. అలాంటి చంద్రబాబు ఇపుడు ఒక్కసారిగా మారిపోయారు అని సొంత పార్టీ వారే అంటున్నారు.
దీనికి తాజాగా ఉదాహరణ ఏంటి అంటే టీడీపీ ఆధ్వర్యంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపడితే హైదరాబాద్ అసలు ఎక్కడా కనిపించలేదు. ఆయన నింపాదిగా హైదరాబాద్ లోని తన ఇంట్లో ఉంటూ కనిపించారు. జూమ్ యాప్ ద్వారానే ఆయన పార్టీ యాక్టివిటీస్ నడిపిస్తూ అలా చేస్తే చాలు అనుకుంటున్నారు. దాంతో ఏపీలో టీడీపీ నిరసనలు తేలిపోయాయి. అలా కాకుండా చంద్రబాబు మంగళగిరి దాకా వచ్చి తన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు ఇచ్చినా వేరేగా కధ ఉండేదని అంటున్నారు తమ్ముళ్ళు. ఈ ఘటన బాబు ఇదివరకు మనిషి కారు అనిపించేలా చేసింది అంటున్నారు.
ఇక ఈ కరోనా రాకపోతే ఏం జరిగేదో కానీ ఆ కారణంగా చంద్రబాబు పూర్తిగా హైదరాబద్ కే పరిమితం అయిపోయారు. ఆయన ప్రతీ రోజూ ఠంచనుగా జూమ్ యాప్ వద్దకు వచ్చి పార్టీ వారికి చెప్పాల్సింది చెప్పేసి తప్పుకుంటున్నారు. ఆ తరువాత మళ్ళీ పట్టించుకోవడంలేదు అంటున్నారు. దానికి వయోభారం ఒక కారణం అయితే మరో వైపు లోకేష్ ని ఫోకస్ చేయడానికే బాబు అలా తెర వెనకకు వెళ్లారని కూడా అంటున్నారు. అయితే లోకేష్ కి ఆ సామర్ధ్యం లేదని తమ్ముళ్ళు అంటున్నారు.
బాబు వస్తేనే కిక్కు ఉంటుందని, బాబే పార్టీ కార్యక్రమాల మీద పూర్తిగా దృష్టి పెట్టాలని కూడా వారు అంటున్నారు. కానీ బాబు ఏదో చుట్టపు చూపుగా మంగళగిరి వస్తున్నారు. ఇలా వచ్చి అలా హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నారు. మొత్తానికి బాబు హైదరాబాద్ లో ఉంటూ కధ నడిపిస్తే పొలిటికల్ గా హిట్ కాదని, తేడాలు వచ్చేస్తాయని నాయకులు అంటున్నారు. బాబులోని పని రాక్షసుడు మళ్లీ బయటకు రావాలని అంతా కోరుకుంటున్నారు.