Begin typing your search above and press return to search.
టీడీపీ కొత్త వ్యూహం: రాజధానిపై ప్రజా బ్యాలెట్
By: Tupaki Desk | 27 Feb 2020 6:45 AM GMTప్రస్తుతం టీడీపీ నాయకులు అధికార పార్టీపై విమర్శల జోరు పెంచారు. పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శల ఘాటు పెంచారు. ముఖ్యంగా రాజధాని తరలింపుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించి రాజధాని ప్రాంతమంతా విశాఖపట్టణానికి తరలించాలని నిర్ణయించడంపై టీడీపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. కావాలంటే నిరూపిస్తామని సవాల్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.
తాజాగా టీడీపీ నాయకులు మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఈ విషయం వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం తెలుగుదేశం పార్టీ ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తుందిట. చంద్రబాబు ఇప్పటికే ప్రారంభించిన ప్రజాచైతన్య యాత్ర లో భాగంగానే.. ప్రజాభిప్రాయ సేకరణకు కూడా బ్యాలెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ అధినేత పర్యటిస్తున్న ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని చోట్ల ఈ ప్రజాబ్యాలెట్ చేపడతారంట. తెలుగుదేశం నాయకులు, నాయకులు రాజధాని వికేంద్రీకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని చెబుతామని, ఆ సర్వేలో అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ వస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
అధికార వికేంద్రీకరణ విశాఖపట్టణం, విజయనగరం, కర్నూలులకు చేయడంతో దీనిపై ఆయా ప్రాంతాల స్థానిక నాయకులతో కలిసి తాము ప్రజాబ్యాలెట్ చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఈ ప్రజాబ్యాలెట్ లో అధికార వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగాలని ప్రజలు చెబుతారని ఆ నాయకులు పేర్కొంటున్నారు. దీనిపై చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా అభిప్రాయ సేకరణ చేస్తారట. యాత్ర పూర్తయ్యేలోపు సర్వే చేసి ఆ వివరాలను వెల్లడిస్తామని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ టీడీపీ చేస్తున్న ఈ ప్రజా బ్యాలెట్ లో సాధారణం గా అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తుంటుంది. అయితే ఈ ప్రజా బ్యాలెట్ అనేది వైఎస్సార్సీపీ గెలిచిన నియోజకవర్గంలో కూడా ఈ ప్రజాబ్యాలెట్ చేయాలని అధికార పార్టీ నాయకులు సవాల్ విసురుతున్నారు. రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా చేస్తే వాస్తవమేమిటో తెలుస్తుందని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. మరీ ఈ ప్రజా బ్యాలెట్ ను ఎలా చేపడతారో.. దానిలో వాస్తవ ఫలితాలు చెబుతారా లేదా అనేది వేచి చూడాలి.