Begin typing your search above and press return to search.

చేతులెత్తేసిన బాబు!... తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌!

By:  Tupaki Desk   |   12 Jan 2019 2:30 PM GMT
చేతులెత్తేసిన బాబు!... తెలంగాణ‌లో టీడీపీ క్లోజ్‌!
X
టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హారం కార‌ణంగా ఇప్పుడు ఆ పార్టీ ఒక్క ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం కానుంది. అస‌లు తెలంగాణ పేరెత్తితేనే... బాబులో భ‌యం పుడుతోంది. మొన్న‌టికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అక్క‌డి ప్ర‌జ‌ల చేతిలో చావు దెబ్బ తిన్న చంద్ర‌బాబు.. తెలంగాణ‌లో మొత్తంగా పార్టీని ఎత్తేసే దిశ‌గా ఆలోచ‌న చేయ‌క త‌ప్ప‌డం లేదు. తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసినా... ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఇటు ఏపీతో పాటు అటు తెలంగాణ‌లోనూ టీడీపీ పోటీ చేయాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్ర‌జ‌లు కొట్టిన దెబ్బ‌కు ఇప్పుడు తెలంగాణలో పోటీ అంటేనే బాబు భ‌య‌కంపితుల‌వుతున్నారు. తెలంగాణ‌లో తమ పార్టీ పోటీ చేసేది లేద‌ని, అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ తో పొత్తు ఉన్నా కూడా తాను తెలంగాణ‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌లేన‌ని కూడా బాబు దాదాపుగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారట‌. ఈ మాట‌ను ఆయ‌న నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకే చెప్పేసిన‌ట్టు కూడా ఇప్పుడు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతానంటూ ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్న చంద్ర‌బాబు... నాలుగేళ్ల పాటు తాను కాపురం చేసిన బీజేపీకి, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి వ్య‌తిరేకంగా కూట‌మిని ఏర్పాటు చేస్తున్నానంటూ కల‌రింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏ పార్టీకి అయితే వ్య‌తిరేకంగా టీడీపీ పుట్టిందో... అదే కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టు క‌ట్టేందుకు చంద్ర‌బాబు వెనుకాడ‌లేదు. పార్టీ సిద్ధాంతాల‌ను అట‌కెక్కించిన చంద్ర‌బాబు... టీఆర్ ఎస్ పాల‌న‌కు తెలంగాణ‌లో చ‌ర‌మ గీతం పాడేస్తానంటూ బీరాలు ప‌లికారు. అయితే టీడీపీ, కాంగ్రెస్ పొత్తును జీర్ణించుకోలేని జ‌నం బాబు య‌త్నాల‌ను ఆదిలోనే స‌మాధి చేసేశారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డ‌మా?, లేదంటే సింగిల్‌గానే బ‌రిలోకి దిగుదామా? అన్న విష‌యంపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోలేక స‌త‌మ‌తం అవుతున్న చంద్ర‌బాబు... మొన్న‌టి డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో త‌న‌కు మూడు చెరువుల నీళ్లు తాగించి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన తెలంగాణ అంశం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింద‌ట‌. దీంతో త‌న మ‌న‌సులోని అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసిన చంద్ర‌బాబు... తెలంగాణ గురించి ఇక త‌న‌ను అడ‌గ‌వ‌ద్దంటూ రాహుల్‌కు తేల్చి చెప్పార‌ట‌. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తాను తెలంగాణ‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌లేన‌ని, అంతేకాకుండా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు సంబంధించిన స్థానాల్లో తాను త‌న పార్టీ అభ్య‌ర్థుల‌తో పోటీ కూడా చేయించ‌లేన‌ని చంద్ర‌బాబు తేల్చి పారేశార‌ట‌.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం మ‌ల్కాజిగిరి స్థానంలో మాత్రం విజ‌యం సాధించింది. అది కూడా అక్క‌డ నిల‌బ‌డ్డ మ‌ల్లారెడ్డి సొంత ఇమేజీతోనే విజ‌యం సాధించార‌ని, అక్క‌డ టీడీపీ ఇమేజీ ఏమాత్రం ప‌నిచేయ‌లేద‌ని కూడా విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇక మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రింత‌గా దెబ్బ త‌గ‌ల‌డంతో బాబు తెలంగాణ‌లో ఎన్నిక‌ల పేరు వింటేనే భ‌య‌ప‌డిపోతున్నార‌ట‌. తాను ప్ర‌చారానికి రాలేన‌ని, త‌న పార్టీ అభ్య‌ర్థులు కూడా పోటీకి దిగేది లేద‌ని తేల్చేసిన చంద్ర‌బాబు... వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌నే బ‌రిలోకి దించుకోండ‌ని రాహుల్‌కు చెప్పేశార‌ట‌. చంద్ర‌బాబు తీసుకున్న ఈ నిర్ణ‌యం కార‌ణంగా ఇప్పుడు తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ అనే మాటే వినిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని తెలుగు త‌మ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నార‌ట‌. తెలంగాణ‌లో పార్టీనే వ‌దిలేసిన చంద్రబాబు... పార్టీ కార్య‌కర్త‌ల ఆవేద‌న‌ను ప‌ట్టించుకుంటారా. నెవ‌ర్‌... సో తెలంగాణ‌లో టీడీపీ ప్ర‌స్థానం ముగిసిన‌ట్టేన‌న్న మాట‌.