Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేకు 30 కోట్ల ఆఫర్ ఇచ్చిన టీడీపీ
By: Tupaki Desk | 3 Dec 2018 8:00 AM GMTవైసీపీ నుంచి టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని వైసీపీ శాసన సభాపక్ష ఉప నాయకుడు - మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన ఓ ట్రస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది వైసీపీలో చేరారు. వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే ముత్యాల నాయుడు మాట్లాడారు. తాను వైఎస్ జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచానని.. ఎప్పటికీ జగన్ వెంటే ఉంటానని.. టీడీపీ ఇచ్చే రూ.30 కోట్లకు అమ్ముడు పోనని స్పష్టం చేశారు.
తనకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశ ఉండేదని.. 2014లో జగన్ ఆశీస్సులతో తన కల నెరవేరిందని ముత్యాల నాయుడు చెప్పుకొచ్చాడు. డబ్బు కోసం పార్టీలు మారే మనిషిని తాను కాదని చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి టీడీపీ మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ మంత్రులు అయ్యన్న - అవంతి శ్రీనివాస్ - గంటా శ్రీనివాసరావులు విశాఖ జిల్లాకు ఏం చేయలేదని విమర్శించారు. గంటా ఆస్తి 10వేల కోట్లు - అయ్యన్న ఆస్తి రూ.5వేల కోట్లు - షీలా గోవింద్ ఆస్తి వేయికోట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు అమర్ నాథ్ సైతం టీడీపీపై మండిపడ్డారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ఏమీ చేసినా జగన్ పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.