Begin typing your search above and press return to search.
వదులుకోవద్దనే : జనసేనకు 40 ప్లస్...?
By: Tupaki Desk | 29 July 2022 4:04 AM GMTఏపీలో జనసేన బలం ఎంత అంటే 2019 ఎన్నికల్లో వచ్చిన ఆరు శాతం చూపించే వారిని పిచ్చోళ్ళు అనాలి. ఎందుకంటే అది మూడేళ్ళ క్రితం నాటి లెక్క. ఇపుడు బాగా పరిస్థితి మారింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పొలిటికల్ సినేరియో పూర్తిగా మారింది. జనసేన ఇక్కడ చాలా చోట్ల టాప్ లెవెల్ లో ఉంది. గతానికి కంటే కూడా రెట్టింపు ఓట్లు తెచ్చుకునే స్థితిలో ఉంది. కొన్ని చోట్ల గెలుపు కూడా సొంతంగా సాధించే సీన్ ఉంది.
కాపులలో పెరిగిన కసి, జనసేనను సొంతం చేసుకుంటున్న వైనం, మారిన రాజకీయ పరిణామాలు, పవన్ పట్ల పెరిగిన జన విశ్వాసం అన్నీ కలసి ఓటు బ్యాంక్ ఒక్క గోదావరి జిల్లాలోనే ముప్పై శాతం పై దాటి ఉండొచ్చని ఒక అంచనా. ఇక్కడా టీడీపీ కూడా బాగానే పుంజుకుంది. కానీ పొత్తులు లేకపోతే మాత్రం పూర్తిగా నష్టపోయేది టీడీపీయే అంటున్నారు.
ఇక పాలపొంగులా గతంలో వైసీపీకి వచ్చిన ఓట్ల శాతం ఇక్కడ బాగా తగ్గిపోనుంది. కాపులలో సీనియర్ సిటిజన్లు అయితే వైసీపీ వైపు ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీలు ఎస్సీలు, ఇతర వర్గాల మద్దతుతో వైసీపీ కూడా పాతిక ముప్పయి శాతానికి రీచ్ అయితే గొప్పే అంటున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీ జనసేన కలిస్తే మాత్రం కచ్చితంగా అరవై శాతం పైగా ఓట్ల షేర్ ని గోదావరి జిల్లాలలో సాధించే చాన్స్ ఉందని అంచనాలు ఉన్నాయి.
దాంతో పాటు దాదాపుగా ఈ ఇద్దరు మిత్రులు స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు.
దాంతో అన్ని వివరాలు తన దగ్గర ఉంచుకున్న టీడీపీ అధినాయకత్వం గతంలో ముప్పయి కంటే ఎక్కువ సీట్లు ఇవ్వకూడననుకున్న ఆలోచనలు మానుకుని జనసేనకు 40 ప్లస్ దాకా సీట్లు ఆఫర్ చేయవచ్చు అంటున్నారు. ఆ విధంగా సీట్లు ఇస్తే కనుక టీడీపీకే బాగా లాభం అంటున్నారు.
రేపటి రోజున అధికారంలోకి సొంతంగా వచ్చే మెజారిటీ సీట్లు టీడీపీకి రావాలీ అంటే జనసేనకు ఈ సీట్లు ఇవ్వాల్సిందే అన్న మాట ఉంది. ఇప్పటికి అయితే రెండు పార్టీలు వేరుగా పొలిటికల్ యాక్షన్ కి దిగినా ఎన్నికలకు దగ్గర చేసి పొత్తు పొడుపులు ఉంటాయి. మొత్తంగా చూస్తే ఈ రెండు పార్టీలు కలిస్తే మాత్రం ఏపీలో వైసీపీ పెను సవాల్ ఎదురవుతుందన్నది కఠిన వాస్తవం. దీనికి విరుగుడుగా వైసీపీ ఏం చేస్తుందో చూడాలి.