Begin typing your search above and press return to search.
భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి?
By: Tupaki Desk | 20 Feb 2016 8:09 AM GMTవైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూమా నాగిరెడ్డిని బుజ్జగించడానికి వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. మరోవైపు జగన్ కూడా అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఇక టీడీపీలో చూసుకుంటే కర్నూలులో భూమాను వ్యతిరేకించే టీడీపీ నేతలు శిల్పా మోహనరెడ్డి సోదరులను, కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు హుటాహుటిన విజయవాడ రమ్మంటూ పిలిచారు. పార్టీ అవసరాల నేపథ్యంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి భూమాను పార్టీలో చేర్చుకునేలా సహకరించాలని చంద్రబాబు వారిని కోరనున్నారు. ఈ పరిణామాలన్నీ భూమా టీం టీడీపీలో చేరుతుందనడానికి సంకేతాలే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కాగా శనివారమే భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలలు చంద్రబాబును కలుస్తారని... టీడీపీలో ఎప్పుడు చేరాలో తేదీని నిర్ణయిస్తారని తెలుస్తోంది. కాగా.... టీడీపీలో భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా ఇంతవరకు వార్తలొచ్చాయి. కానీ, నాగిరెడ్డికి కాకుండా అఖిల ప్రియను మంత్రిని చేస్తారని తెలుస్తోంది. అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చి నాగిరెడ్డిని పూర్తిగా పార్టీ పనిపై ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో బలంగా ఉన్న వైసీపీని మొత్తంగా ఖాళీ చేయించే పని నాగిరెడ్డికి అప్పగిస్తారని తెలుస్తోంది.