Begin typing your search above and press return to search.
టీడీపీ మహిళా నేత.. ఈ కుక్కల భాష ఏమిటో!
By: Tupaki Desk | 15 Feb 2020 10:30 AM GMTతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆ పార్టీ అధికార ప్రతినిధులు రంగంలోకి దిగారు. వీళ్లు తమ అధ్యక్షుడు చాలా మంచి వ్యక్తి అని, నిజాయితీ పరుడు అని వాదిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నిజాయితీ గురించి ఆయనే తరచూ చెప్పుకుంటూ ఉంటారనే సంగతి తెలిసిందే. తను నిప్పు అని చంద్రబాబు నాయుడు తనకు తనే సర్టిఫికెట్ చాలా సార్లు ఇచ్చుకున్నారు. మరి నిప్పును తాకితే మసి అయ్యేది తాకే వాళ్లే కదా! కానీ చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గరే ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల స్థాయి అక్రమాస్తులు దొరికాయనే విషయం సంచలనంగా మారింది.
ఈ వ్యవహారం పై చంద్రబాబు నాయుడు ఇంకా స్పందిచడం లేదు! ఆయన హైదరాబాద్ లో ఉన్నారని, తమ వాళ్లతో చర్చలు జరుపుతూ తర్జనభర్జనల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆ సంగతలా ఉంటే.. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ ఏదో కుక్కల థియరీని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు పై అనవసరంగా అభాండాలు వేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఆ విషయాన్నే ఏదో కుక్కల పోలికతో చెప్పుకొచ్చారు ఆమె. చంద్రబాబునాయుడు గారు మంచి కుక్క... ఆయనను పిచ్చికుక్క అంటున్నారంటూ.. అనూరాధ చెప్పుకురావడం చోద్యంగా మారింది. చంద్రబాబు నాయుడు మంచి వారని చెప్పడానికి ఆమె పోలికను వాడటం కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టుగా ఉంది!
చంద్రబాబు నాయుడు మంచికుక్క అని, పిచ్చికుక్క అని ఆయనపై ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆవేధన భరితులు అయ్యారు. చంద్రబాబు పై ఆమెకు మమకారం ఉంటే ఉండొచ్చు, ఆయన నిజాయితీ పరుడని వాదించవచ్చు. అయితే.. ఇలా కుక్కల పోలిక మాత్రం పెట్టకుండా ఉండాల్సిందని పరిశీలకులు అంటున్నారు.