Begin typing your search above and press return to search.
ఏపీ బీజేపీని ఆడుకుంటున్న టీడీపీ!
By: Tupaki Desk | 26 July 2019 4:45 AM GMTఅదిగో అయిపోయింది తెలుగుదేశం కథ - ఇక నేతలంతా భారతీయ జనతా పార్టీ బాటలోనే నడుస్తారు. ఆంధ్రాలో కాపు టీడీపీ లీడర్లు బీజేపీలోకి చేరతారు - రాయలసీమలో టీడీపీలోని రెడ్లంతా కమలం పార్టీలోకి చేరిపోతారు.. అని అంటూ బీజేపీ వాళ్లూ ఊదరగొట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచినే ఈ మాటలు చెప్పారు.
అయితే నెలలు గడుస్తున్నా ఒక్క పెద్ద తల కూడా టీడీపీ నుంచి వచ్చి బీజేపీలోకి చేరకపోవడం గమనార్హం. నలుగురు రాజ్యసభ సభ్యులు అయితే చేరారు. వారు ఎందుకో చేరారో - వారి చేవ ఎంతో అందరికీ తెలిసిన సంగతే.
చివరకు బీజేపీకి మిగిలింది వాళ్లు మాత్రమే అయ్యేట్టు ఉందని పరిశీలకులు అంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పలువురు రెడ్డి నేతలు బీజేపీలోకి చేరబోతున్నట్టుగా లీకులు వచ్చాయి. అయితే అవి లీకులు గానే మిగిలిపోయాయి. కమలం పార్టీ మీద వారు నమ్మకం ఉంచి ఆ పార్టీలోకి చేరడం లేదు.
ఇక కోస్తాంధ్రలో కాపు నేతలు బీజేపీలోకి క్యూ కడతారనే లీకులూ వచ్చాయి. ఆ మధ్య తెలుగుదేశంలోని కాపు నేతలు ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నారు. అప్పుడు ఆ ఊహాగానాలే రేగాయి. వారంతా జాయింటుగా బీజేపీలోకి చేరబోతున్నట్టుగా ప్రచారం జరిగింది.
ఆ ప్రచారంతో బీజేపీ వాళ్లు ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు. చివరకు బీజేపీలోకి చేరుతున్నది ఎవరంటే.. నాదెండ్ల భాస్కరరావు వంటి వాళ్లు! అదీ ఏపీలో బీజేపీ ప్రస్తుత పరిస్థితి. ఇక బీజేపీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు కూడా కొంతమంది టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి ప్రాధేయపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో నెగ్గలేకపోయిన వాళ్లను తమ పార్టీలోకి వచ్చి చేరమని బీజేపీ వాళ్లు కోరుతున్నారు.
కేంద్రంలో అధికారం బీజేపీ చేతిలో ఉన్నా, రాష్ట్రంలో టీడీపీ చిత్తు అయిపోయినా కమలం పార్టీలోకి మాత్రం చేరికలు ఉదృతంగా లేవు. అదెందుకో చెప్పడం కూడా సులువే. ఏపీకి బీజేపీ ఎలాంటి ప్రయోజనాలనూ కలిగించడం లేదు. జనాల్లో బీజేపీపై ఎలాంటి సానుకూలత లేదు. అందుకే నేతలు కూడా ఎవ్వరూ కమలం పార్టీ వైపు చూడటానికి ఆసక్తి చూపడం లేదని భోగట్టా.