Begin typing your search above and press return to search.

అంటే.. జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్లు అంతేనా...? టీడీపీలో గుసగుస..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 12:30 AM GMT
అంటే.. జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్లు అంతేనా...?  టీడీపీలో గుసగుస..!
X
టీడీపీలో ఆస‌క్తి క‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏ ఇద్ద‌రు త‌మ్ముళ్లు క‌లిసినా.. ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌న‌కెన్ని.. జ‌న‌సేన కెన్ని అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీనే పోటీ చేసింది. అయితే.. వ్యూహాత్మ‌కం గా కొన్ని చోట్ల డ‌మ్మీ క్యాండెట్ల‌ను పెట్టార‌నే చ‌ర్చ ఉంది. ఇక‌, 2014లో అయితే.. బీజేపీతో క‌లిసి అడుగులు వేశారు కాబ‌ట్టి.. ఆ ప‌రిస్థితి వేరు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించారు. అయితే.. ఇప్పుడు మాత్రం కేవ‌లం జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునే అవ‌కాశ‌మే క‌నిపిస్తోంది.

బీజేపీ నేత‌లు క‌లుస్తారా? చంద్ర‌బాబుతో క‌లిసి అడుగులు వేస్తారా? అంటే.. ``ఇంకా గ‌తం మ‌రిచిపోలేదు`` అంటూ.. ఆ పార్టీ నేత‌లు చేస్తున్న కామెం ట్లు స‌హ‌జంగానే టీడీపీని బాధిస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం, ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెర‌గ‌డం కామనే. `అవ‌స‌రమై న‌ప్పుడు కౌగిలించుకోవాలి.. ` అనే సామెత‌ను రాజ‌కీయాల్లో నాయ‌కులు బాగా వాడుతుంటారు. ఇప్పుడు ఏపీలోనూ అదే త‌ర‌హా వాతావర‌ణం కావాల‌ని టీడీపీ కోరుకుని ఉండొచ్చు. కానీ, ఆ పార్టీతో అన్ని పార్టీలూ క‌ల‌వాల‌ని లేదు క‌దా! ఇప్పుడు అదే జ‌రుగుతోంది.

సో.. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ క‌లిసే వ‌ర‌కు చెప్ప‌డం క‌ష్ట‌మే. అయితే.. జ‌న‌సేన మాత్రం క‌లుస్తుంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తే.. ఎన్నిసీట్ల‌ను ఎవ‌రు పంచుకుంటారు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. టీడీపీ క‌నీసంలో క‌నీసం 40 సీట్లు ఇస్తుంద‌ని.. 50 నుంచి 60 మ‌ధ్య‌లో ఇచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చ‌ర్చ సాగింది. దీనిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు కూడా.. జ‌రుగుతున్నాయి. అయితే.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ టీడీపీ 160 స్థానాల్లో పోటీ చేసి గెలిచి తీరుతుంద‌ని అన్నారు. ఈ విష‌యంలో ఆయ‌న క్లారిటీతోనే ఉన్నార‌నే సంకేతాలు అయితే వ‌చ్చాయి.

అంటే.. 160 స్థానాల్లో టీడీపీ పోటీకి దిగితే.. మిగిలిన 15 స్థానాల ప‌రిస్థితి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. దీనిని బ‌ట్టి..జ‌న‌సేన‌కు కేటాయించే సీట్లు ఇవేనా? ఈ 15 స్థానాల‌కే జ‌న‌సేన‌ను ప‌రిమితం చేస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. మొత్తానికి టీడీపీ ప‌ట్టు అయితే.. 160 స్థానాల‌పై ఉంటుంద‌ని స్ప‌ష్ట‌మైంది. ఒక‌వేళ జ‌న‌సేన‌కు 15 స్థానాలే కేటాయిస్తే.. ఇది తేడా కొడుతుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.