Begin typing your search above and press return to search.
టీడీపీకి `పరువు` సమస్య
By: Tupaki Desk | 24 April 2016 5:39 AM GMTతెలంగాణలో వరుస ఓటములు.. పార్టీ కేడర్ లో నైరాశ్యం.. నిస్సహాయ స్థితిలో నాయకులు.. ఓ వెలుగు వెలిగిన పార్టీ నేడు పూర్తి సుప్తచేతనావస్థలో పడిపోయింది! ఇదీ తెలంగాణ తెలుగుదేశం పరిస్థితి. తెలంగాణ వచ్చాక ఎక్కువగా నష్టపోయిన పార్టీ తెలుగుదేశం! నాయకులంతా పార్టీని వీడటం ఒకపక్క బాధిస్తుంటే.. ఏ ఎన్నికల్లో పోటీచేసినా ఓటమి పాలవుతుండటం పార్టీ అధిష్టానాన్ని కూడా కుంగదీస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితం కావడం.. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసుకునే సీనియర్ నాయకులు లేకపోవడంతో పార్టీ ఎన్నికల్లో సరైన ప్రణాళికలు చేపట్టలేకపోతోంది.
అయితే ఇప్పుడు ఉప ఎన్నిక జరిగే పాలేరులోనూ పార్టీకి `పరువు` సమస్య వచ్చింది. పార్టీ తరఫున బరిలోకి దిగకపోతే పరువు నష్టం.. అలా అని బరిలోకి దిగితే గెలుపు దక్కుతుందనే గ్యారెంటీ లేదు!! కనీసం పరువు అయినా నిలుస్తుందా..? అసలే ఇప్పటికీ వరుస ఓటములకు తోడు ఈ ఓటమి కూడా తోడయితే.. అది పార్టీకి మరింత నష్టం కలిగించేదే! ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలా అని టీటీడీపీ నేతలు యోచిస్తున్నారట. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా టీటీడీపీ పరిస్థితి మారింది. దీంతో ఇక బంతిని అధినేత చంద్రబాబు కోర్టులోకి పంపించారట.
ఉప ఎన్నిక కు నోటిఫికేషన్ రాగానే టీడీపీ లో కాస్త జోరు కనిపించింది. తమ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరు ఖరారుచేసింది. అయితే అక్కడ మరణించిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్యకు టికెట్ ఇచ్చాం గనుక తమకు మద్దతు ఇవ్వాలని..టీడీపీని కాంగ్రెస్ కోరుతోంది. నామా కూడా… అలాంటి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించడానికే సుముఖంగా ఉన్నట్లు మాట్లాడారు. మరొకవైపు కాంగ్రెస్ వినతికి సీపీఎం నో చెప్పింది. ఈ నేపథ్యంలో తాము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే, ఎన్నికలకు భయపడినట్లు టీఆర్ ఎస్ విమర్శలు భరించాల్సి వస్తుందని టీ టీడీపీ ఆలోచన. కాంగ్రెస్ తో జతకట్టి కూడా తెరాస ను ఓడించలేకపోతే పరువు పోతుందనే భయం కూడా ఉంది. ఈ సమయంలో పాలేరు ఎన్నికల్లో పోటీచేయాలా వద్దా అనే అంశంపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.