Begin typing your search above and press return to search.

బస్తీమే సవాలంటున్న టీడీపీ

By:  Tupaki Desk   |   23 Oct 2021 4:35 AM GMT
బస్తీమే సవాలంటున్న టీడీపీ
X
తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బస్తీమే సవాల్ తేల్చుకుందాం రమ్మంటున్నారు. నేరుగా కొట్టేసుకుందాం రమ్మని విజయవాడ మున్సిపల్ గ్రౌండ్ అయినా పర్వాలేదు లేకపోతే పీడబ్ల్యూడీ మైదానం అయినా పర్వాలేదని సవాలు విసరటమే ఆశ్చర్యంగా ఉంది.

రోజు తిట్టుకోవటం కన్నా ఒకరోజు ముహూర్తం పెట్టుకుని డైరెక్టుగా ఫైటింగ్ చేసుకుందాం రమ్మంటున్నారు. ఇక్కడ ఎంపీ వైఖరే చాలా విచిత్రంగా ఉంటోంది. నేరుగా కొట్టేసుకుందామని, గ్రౌండ్ కూడా డిసైడ్ చేసేశారు. కాకపోతే డే అండ్ టైమ్ మాత్రం అధికార వైసీపీ నేతలనే డిసైడ్ చేయమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎంపీ మాత్రమే కాదు నారా లోకేష్, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు కూడా పదే పదే సవాళ్ళు విసురుతున్నారు.

ప్రజాస్వామ్యంలో డైరెక్టుగా కొట్టేసుకోవటం అనేది ఉండదన్న ఇంగితం కూడా వీళ్ళల్లో లోపించటమే విచిత్రంగా ఉంది. కర్నూలు జిల్లాలో అదేదో పండగ సందర్భంగా చాలామంది ఒకచోట చేరి కర్రలతో చచ్చేట్లుగా కొట్టేసుకుంటారు. అదేమంటే ఇది తమ ఆచారం అంటారు. పోలీసులు కూడా వీళ్ళని ఏమీ చేయలేక వీళ్ళ ఖర్మానికి వీళ్ళని వదిలేశారు. ఇపుడు టీడీపీ నేతల సవాళ్ళు కూడా బహశా అలాగే కర్రలు తీసుకుని కొట్టేసుకోవాలని అన్నట్లుగా ఉంది చూస్తుంటే. ఒకళ్ళేమో దీక్షలో ఉన్న చంద్రబాబునాయడును కొట్టమంటారు. మరొకళ్ళేమో తామున్నపుడు పార్టీ ఆఫీసుకు వస్తే కొట్టుకుందామంటారు. ఇంకెరేమో మైదానంలో కొట్టుకునేందుకు రెడీ అంటారు.

ప్రజాస్వామ్యంలో అందులోను రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్ధులు ఫైటింగ్ చేయటమంటే అంటే కర్రలు తీసుకుని కాకుండా ఎన్నికల్లో ఓటింగ్ రూపంలోనే ఉంటుందని మరచిపోయారు. 2019లో జరిగిన ఇలాంటి ఫైటింగ్ లోనే టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. మళ్ళీ డైరెక్టుగా ఎవరు గొప్పో తేల్చుకోవాలంటే 2024 వరకు ఆగాల్సిందే. ఏవో స్ధానిక సంస్ధల రూపంలో జరిగిన పైటింగ్ లో అధికార పార్టీనే గెలిచింది. ఈ విషయాల మరచిపోయి బస్తీమే సవాలని డైరెక్టు వస్తే కొట్టేసుకుందామని ఎంపీ చెప్పటం చాలా చీపుగా ఉంది.

టీడీపీ నేతల మాటలు వాళ్ళ శ్రేణులను రెండు నిముషాలు ఉత్సాహ పరచటానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు. అయితే సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా చీపుగా కొట్టేసుకుందాం రమ్మని సవాళ్ళు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. బహుశా హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ ఏమన్నా ఆవహించారేమో అనే అనుమానంగా ఉంది. లేకపోతే సినిమా డైలాగులేమిటో ? ఆ సవాళ్ళకు అర్ధమేంటో తమ్ముళ్ళే చెప్పాలి.