Begin typing your search above and press return to search.

ఆ పార్టీ ఎన్నికల షూటింగ్‌ షురూ!

By:  Tupaki Desk   |   28 Nov 2022 7:35 AM GMT
ఆ పార్టీ ఎన్నికల షూటింగ్‌ షురూ!
X
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధించడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఓవైపు పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో చురుకుగా పర్యటిస్తున్నారు. నారా లోకేష్‌ సైతం జనవరి నుంచి 4000 కిలోమీటర్ల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇంకా ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అప్పుడే టీడీపీ ఎన్నికల ప్రచార చిత్రాలు, ఎన్నికల పాటల రూపకల్పనపై ముందడుగు వేసేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలోని పొలాల్లో ఒక పాటను చిత్రీకరించారు.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు పరిధిలోని పంట పొలంలో 'జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం' పాటను షూట్‌ చేశారు. పాటకు తగ్గ సన్నివేశాల షూటింగ్‌తో కంకిపాడు పరిసరాల్లో సందడి నెలకొంది.

జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం పాటలో ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ప్రగతి, అభివృద్ధిని ప్రస్తావిస్తూ సాహిత్యం ఉంది. ప్రస్తావించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవాల్సిన అవసరం, వ్యూహం, 'తెలుగుతల్లి' గొప్పతనం తదితర అంశాలతో మేళవింపుతో ఈ పాట సాహిత్యం ఉండటం విశేషం.

ఈ క్రమంలో షూటింగ్‌ స్పాట్‌ అయిన ఈడుపుగల్లు పొలాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌ చిత్రాలతో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అలాగే వీరు 'యుద్ధబేరి'లను కంకిపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని రాజా, సర్పంచి పి.ఇందిర తదితరులు 'మోగించడం'తో పాటను ప్రారంభించారు. షూటింగ్‌తో టీడీపీ జెండాలు, రంగు, పొగతో పసుపు ప్రాంగణమైపోయింది.

కాగా... జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం పాటలో టీడీపీ నేతలు, కార్యకర్తలే కథానాయకులు, నటీనటులు కావడం గమనార్హం. సినిమా నటులు మాదిరి అనుభవం ఉన్నవారిని తలపించే రీతిలో టీడీపీ కార్యకర్తలు, నేతలు నటించడం విశేషం.

షూటింగ్‌లో భాగంగా 'బాహుబలి' చిత్రంలోని యుద్ధ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా శత్రువుపైకి దూసుకు వెళ్లారు. అలాగే ఎన్నికల యుద్ధ భేరి మోగించారు.. సమర శంఖం పూరించారు. గుర్రాలతోపాటు పరుగెత్తి దుమ్ము లేపారు. వృద్ధులు సైతం యువకులతతో పోటీ పడి నటించడం విశేషం.

ఎన్టీఆర్‌ చిత్రంతో ఉన్న భారీ జెండాను గంటపాటు ఈదురుగాలిలో అలుపులేకుండా ఒక పార్టీ కార్యకర్త నిలబెట్టాడు. ఓవైపు బాలికల సంప్రదాయ, శాస్త్రీయ నృత్యాలు, యువకులు పాశ్చ్యాత్య సంగీతానికి అనుగుణంగా స్టెప్పులు వేయడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.