Begin typing your search above and press return to search.

'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' తొలిరోజున బాబు వెళ్లే ఊళ్లు అన్నా?

By:  Tupaki Desk   |   30 Nov 2022 3:29 AM GMT
ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి తొలిరోజున బాబు వెళ్లే ఊళ్లు అన్నా?
X
మీద పడిన వయసు ఒకవైపు. మరోవైపు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలోనే తానెప్పుడు ఎదుర్కొనని ప్రతికూలతలు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఉత్సాహాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా తీవ్రంగా శ్రమిస్తున్న రాజకీయ పార్టీ అధినేత చంద్రబాబు. ఇప్పటి ఆయన వయసు 72 ఏళ్లు. ఇలాంటి వయసులో సాధారణంగా ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా చంద్రబాబు ఉన్నారని చెప్పాలి.

ఏపీలోని జగన్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.యాభై రోజుల పాటు సాగే ఈ ప్రోగ్రాంను ప్రారంభిస్తున్న చంద్రబాబు.. అందులో భాగంగా ఆయన శ్రమిస్తున్న వైనం చూసినోళ్లంతా నోట మాట రాని రీతిలో ఉండిపోతున్నారు. ఇంత వయసులో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా ఇంతలా శ్రమించటమా? అని విస్మయానికి గురయ్యే పరిస్థితి.

ఈ రోజు (బుధవారం) నుంచి మొదలయ్యే 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' ప్రోగ్రాం సంగతే తీసుకుంటే.. ఇందులో పాల్గొనేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆయన ఉభయ గోదావరిజిల్లాల్లో పర్యటించనున్నారు. అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లే చంద్రబాబు కలపర్రు టోల్ గేట్ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు.

ఆ తర్వాత వలసపల్లి క్రాస్ రోడ్ మీదుగా చింతలపూడి పట్టణానికి వెళ్లి.. దారిలో ధర్మాజిగూడెం.. మఠంగూడెం.. లింగపాలెం గ్రామాల్లో ప్రజలతో మాట్లాడతారు. సాయంత్రం చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ఈ సభ అయ్యాక అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెం గ్రామానికి చేరుకొని అక్కడి ఫంక్షన్ హాల్లో బస చేయనున్నారు. ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగాశ్రమించటం చంద్రబాబుకే చెల్లుతుందని చెప్పాలి. రెండు బహిరంగ సభలు.. మూడు ఊళ్లలో ప్రజలతో మాట్లాడనున్నారు.

నిజానికి ఇంతటి బిజీ షెడ్యూల్ ను మరే నేత అయినా సరే ఫాలో కావాలంటే కిందా మీదా పడతారు. కానీ.. చంద్రబాబు మాత్రం వేరు. ఆయనకు ఒకసారిప్రోగ్రాం డిసైడ్ అయినట్లు చెబితే చాలు.. దాన్ని యథాతధంగా అమలు చేసేందుకు అస్సలు వెనుకాడరు. ఇదంతా చూసినప్పుడు మిగిలిన రాజకీయం ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం ఇంతలా శ్రమించటం.. అది కూడా ఆ వయసులో అన్నది మాత్రం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతుందని.. మరెవరికీ అలాంటిది సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.