Begin typing your search above and press return to search.
కళ్యాణదుర్గం టీడీపీలో ఆధిపత్య పోరు.. ఏం జరుగుతోందంటే
By: Tupaki Desk | 21 Jan 2022 8:01 AM GMTఅనంతపురం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లోటీడీపీకి సంస్థాగత ఓటు బ్యాంకు ఉంది. 2014 ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. 2019 ఎన్నికల నాటికి ఈపరిస్థితి మారిపోయింది.
వైసీపీ దూకుడు, జగన్ పాదయాత్ర సునామీ వంటివి బాగా పనిచేశాయి. దీంతో టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే విజయం దక్కించుకుంది. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు పార్టీ శాయశక్తులా పని చేయాలని పార్టీ అధిష్టానం చెబుతోంది.
అయితే.. ఈ క్రమంలో నేతల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వర్సెస్ ఇతర నేతల మధ్య పోరు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఆధిపత్య పోరులో ఓ వర్గం నేతలు.. మరో వర్గంపై విమర్శలు, భౌతిక దాడులక కూడా దిగుతుండడం గమనార్హం.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గానికి, పార్టీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వరనాయుడుకు మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. పార్టీలో నేను ముఖ్య నేతను అంటే.. నేనే ముఖ్యననేతను అనే పరిస్థితికి ఇక్కడి రాజకీయం చేరుకుంది. దీంతో పార్టీ కార్యక్రమాల్లోనూ.. వీరి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని.. పార్టీ అధినేత చంద్రబా బు పిలుపునిచ్చారు. దీంతో కళ్యాణదుర్గంలో ఆందోళనలకు ఇరు వర్గాలు పిలుపునిచ్చాయి.
ఈ క్రమంలో ఉన్నం వర్గం ఇటీవల ఆందోళనకు దిగగా.. పార్టీ తరఫున కేవలం పదిమంది మాత్రమే హాజరయ్యారు. అయితే... అదేసమయంలో ఉమా మహేశ్వరనాయుడు చేపట్టిన ధర్నా పూర్తిగా సక్సెస్ అయింది. నాయకులు పోటెక్కారు. దీంతో ఉన్నం చేపట్టిన ధర్నా ఫెయిల్ అయిందంటూ.. ఉమా వర్గం పెద్ద ఎత్తున వాట్సాప్‌లలో ప్రచారం చేయడం ప్రారంభించారు.
దీనిపై.. ఉన్నం వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలోనే నేతలు తమను ఇరకాటంలో పెడుతున్నారని.. తాము చేపట్టే నిరసనలకు కార్యకర్తలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ.. ఉన్నం వర్గం ఏకంగా పార్టీ అధిష్టానం వరకు సమస్యను తీసుకువచ్చింది.
నిజానికి నాయకులు ఎంత మంది ఉన్నా.. కలిసి పనిచేయాలని పార్టీ అధిష్టానం చెబుతోంది. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు .. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండడం, రోడ్డున పడడం పార్టీకితలనొప్పిగా మారింది. ఈ పరిణామాలు వైసీపీలోనూ చర్చగా మారుతున్నాయి. తమకు ఢోకాలేదని... ప్రత్యర్థులు వారిలోవారే కొట్టుకోవడం తమకు కలిసి వస్తుందని అంటున్నారు.
వాస్తవానికి కళ్యాణ దుర్గం 2019లో కూడా టీడీపీ గెలవాల్సిన సీటు. కానీ వీరిద్దరు కొట్టుకుని వైసీపీ చేతిలో పెట్టారు. ఇప్పటికీ దీనిని చంద్రబాబు సరిదిద్దలేకపోతున్నారు. వాస్తవానికి ఉన్నం వర్గం 1983 నుంచి ఇక్కడ ఉంది. 2014 విజయం తర్వాత మరింత పట్టుసాధించింది. అయితే, 2019లో చంద్రబాబు చేసిన కొత్త ప్రయోగం విఫలమైంది. ఇపుడే జాగ్రత్త పడకపోతే 2024 కూడా ఉత్తినే పోగొట్టుకునే పరిస్థితి.