Begin typing your search above and press return to search.

ముంద‌స్తు ఉంద‌న్నా.. 'తమ్ముళ్లు' క‌ద‌ల‌రా?

By:  Tupaki Desk   |   14 Oct 2022 5:57 AM GMT
ముంద‌స్తు ఉంద‌న్నా.. తమ్ముళ్లు క‌ద‌ల‌రా?
X
పాపం.. చంద్ర‌బాబు! టీడీపీ ప‌రిస్థితిని నిశితంగా గ‌మ‌నిస్తున్న పార్టీ అభిమానులు చేస్తున్న వ్యాఖ్య ఇదే!! ఎందుకంటే.. గ‌త నాలుగు నెల‌ల నుంచి కూడా.. చంద్ర‌బాబు.. పార్టీనిలైన్‌లో పెట్టాల‌ని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న‌.. పార్టీ నేత‌ల‌ను అదిలిస్తున్నారు. క‌దిలించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా.. ఎవ‌రూ మాట విన‌డం లేదు. ఇదివాస్త‌వం. చంద్ర‌బాబుకూడా.. ఈ విష‌యం తెలుసు. అందుకే ఆయ‌న ముంద‌స్తు మంత్రం ప‌ఠిస్తున్నారు.

రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని.. వ‌చ్చేస్తాయ‌ని.. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధులు లేవ‌ని.. అందుకే.. ఏ క్ష‌ణ‌మైనా.. ఖ‌చ్చితంగా.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిపోతారని.. మీరు రెడీగా ఉండాల‌ని.. నాయ‌కుల‌కు .. క్షేత్ర‌స్థాయిలో బోధిస్తున్నారు. మండ‌ల‌స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు నాయ‌కుల‌తో చంద్ర‌బాబు వ‌రుస‌ స‌మీక్షలు చేశారు. ప్ర‌తి ఒక్క‌రికీ.. త‌మ త‌మ వీక్‌నెస్‌లు చెప్పారు. వాటిని ఎలా అధిగ‌మించాలో.. సూచించారు.

దీంతో ఇంకేముంది.. పార్టీ పుంజుకుంటుంద‌ని.. వైసీపీని ఒంట‌రిగానే ఢీ కొంటుంద‌నే సంకేతాలు.. చంద్ర బాబు పంపేశారు. మ‌రి.. ఇది నిజ‌మేనా.. నాయ‌కులు పుంజుకున్నారా? అంటే.. లేద‌నే చెప్పాలి. ఎందు కంటే. పార్టీ కీల‌క ల‌క్ష్య‌మైన ఏకైక రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా.. రైతులు పాద‌యాత్ర చేస్తున్నారు.

ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో ఇది సాగుతోంది.అయితే.. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ నేత‌లు విఫ‌ల య‌త్నా లు చేస్తున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో రైతుల‌కు ఎంత మంది టీడీపీ నేత‌లు అండ‌గా ఉంటున్నారు.? అంటే.. ప్ర‌శ్న‌గానే మిగిలింది.

ఎప్పుడు క‌నిపించే మొహాలే క‌నిపిస్తున్నాయి త‌ప్ప‌.. నిద్రాణంగా ఉన్న నాయ‌కులు మాత్రం మేల్కొన‌లే దు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. మ‌న కెందుకులే అని అనుకుంటున్నా రో.. లేక కేసుల‌కు భ‌య‌ప‌డుతున్నారో.. తెలియ‌దు.

ఇవ‌న్నీ.. కాకుండా.. చంద్ర‌బాబు ఇన్ని చెబుతున్నా.. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా.. చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు.. ఆయ‌న సూచిస్తున్న‌ట్టు క్షేత్ర‌స్తాయి నాయ‌కులు మాత్రం పుంజుకోక పోవ‌డం.. మ‌రోసారి పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.