Begin typing your search above and press return to search.
మునుగోడు పోరుకు దూరం...టీడీపీ ఓట్లు ఎవరికంటే...?
By: Tupaki Desk | 13 Oct 2022 3:30 PM GMTతెలంగాణాలోని మునుగోడు ఉప ఎన్నిక సీరియస్ గానే సాగుతోంది. నామినేషన్లకు రేపే చివరి రోజు. దాంతో ఇప్పటికే అన్ని పార్టీలు నామినేషన్లు వేశాయి. ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో తన సత్తా ఏపాటిదో చూపిద్దమనుకుని మునుగోడు ఉప ఎన్నిక మొదట్లో కొంత చర్చ జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చివరాఖరున తేల్చింది ఏంటి అంటే మునుగోడు పోరుకు దూరంగా ఉండాలని. ఈ విషయన్ని తెలంగాణా టీడీపీ ప్రెసిడెంట్ బక్కని నరసింహులు వెల్లడించారు. తమ పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేయదని ఆయన తేల్చేశారు.
మునుగోడులో కార్యకర్తలు నాయకులు దీన్ని గమనంలోకి తీసుకుని అక్కడ పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సంస్థాగతంగా పార్టీ పటిష్టం కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. ఇదిలా ఉంటే మునుగోడులో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు జక్కని ఐలయ్య యాదవ్ పేరుని పార్టీ పరిశీలించింది అని వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు తూచ్ అనేయడం ద్వారా టీడీపీ రేసు నుంచి తప్పుకుంది.
ఇదిలా ఉంటే మునుగోడులో టీడీపీకి కొంత బలం ఉంది అని అంటున్నారు. కానీ ఆ పార్టీ ఎపుడూ అక్కడ నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. 1983 నుంచి చూస్తే వామపక్షాలు సహా టీయారెస్ కాంగ్రెస్ గెలిచినా టీడీపీ మాత్రం బోణీ కొట్టలేదు.
అయితే పొత్తులో భాగంగా ఎపుడూ ఆ సీటుని కామ్రేడ్స్ కి టీడీపీ కేటాయిస్తూ వచ్చింది. ఇక ఎంతో కొంత ఓట్ల బలం టీడీపీకి ఉన్నా పోటీ చేయకపోవడం వెనక కారణాలు తెలియరావడంలేదు.
అయితే అక్కడ బీజేపీ బరిలో ఉంది. బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీడీపీ నుంచి ఆ కాసిన్ని ఓట్లు మళ్ళుతాయా అన్న చర్చ సాగుతోంది. బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్న టీడీపీ ఈ విధంగా ఉడతా సాయం చేయడానికే పోటీలో నుంచి తప్పుకుంది అని అంటున్నారు.
ఇక మునుగోడు విషయంలో చూస్తే ఉప ఎన్నికలో ఈసారి ప్రతీ ఓటూ కీలకమే అంటున్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్నందువల్ల టీడీపీకి ఉన్న పరిమితమైన ఓట్లు కూడా బీజేపీకి ప్రాణప్రదమే అంటున్నారు. సో ఆ విధంగా ఏమైనా అవగాహనతోనే పోటీ నుంచి తప్పుకుందని అంటున్నారు. చూడాలి మరి మునుగోడులో బీజేపీ గెలిస్తే అపుడు టీడీపీ లోపాయికారీ సాయం కూడా తెలుసుతుంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.