Begin typing your search above and press return to search.

జ‌నాల‌కు ఏం చెప్పాలో... టీడీపీలో ఇదో చర్చ‌...!

By:  Tupaki Desk   |   8 Nov 2022 3:30 PM GMT
జ‌నాల‌కు ఏం చెప్పాలో... టీడీపీలో ఇదో చర్చ‌...!
X
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. రెడీగా ఉండాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తన పార్టీ నాయ‌కుల‌కు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా గెలుపు గుర్రం టీడీపీదేన‌ని ఆయ‌న అంటున్నారు. ఓకే. ఇంత వ‌ర‌కుబాగానే ఉంది.

పార్టీ నాయ‌కుల‌ను ఉత్తేజ ప‌రిచేందుకు.. పార్టీని పరుగులు పెట్టించేందుకు ఈ వ్యూహం అమ‌లు చేయ‌డం వ‌ర‌కుఓకే. కానీ, అస‌లు స‌మ‌స్య ఇక్క‌డే తెర‌మీదికి వ‌స్తోంది. అదేంటంటే.. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. ఏం చెప్పాలి? అనేదే!

ఎందుకంటే.. ఇటీవ‌ల ఒక ఆన్‌లైన్ ఛానల్ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను కోరింది. దీనిలో ఏ పార్టీవైపు మొగ్గు చూపుతార‌ని ప్ర‌శ్నించింది. దీనికి ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న క‌నిపించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌వ‌ర‌త్నాలు, పింఛ‌న్ల‌ను ఇంటికి తెచ్చి ఇవ్వ‌డం, అమ్మ ఒడి, రైతు భ‌రోసా కేంద్రాల అమ‌లు.. వంటివి చేసేవారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని.. చాలా జిల్లాల్లో ప్ర‌జ‌లు తేల్చి చెప్పారు. ఈ వీడియోలు జోరుగా వైర‌ల్ అయ్యాయి. దీంతో టీడీపీలో ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు వ‌చ్చినా.. ప్ర‌జ‌ల‌కు ఏం చెబుదాం.. ప్ర‌జ‌ల ను ఎలా మ‌నవైపు తిప్పుకొందాం.. అని వారు చ‌ర్చిస్తున్నారు. ఎందుకంటే.. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. ప్ర‌జ‌లు ఆలోచించేది.. త‌మ‌కు లాభం ఏంటి? అనే. పోలీసుల దాడులు.. లేదా కేసులు.. ఇంకా ఏవి ఉన్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌కు ఇవేవీ ప‌నికిరావు. ప్ర‌భుత్వం త‌మ‌కు ఇప్పుడు చేస్తున్న ల‌బ్ధిని కొన‌సాగించే పార్టీనే కావాల‌ని వారు కోరుకుంటారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏపీలోనూ జ‌గ‌న్ అన్నీ చేస్తాన‌ని చెప్ప‌లేదు. కానీ, వాటికి మించి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో ప్ర‌జ‌లు ఆయ‌న‌వైపు మొగ్గు చూపారు. ముఖ్య‌మైన అమ్మ ఒడి ప‌థ‌కం మ‌హిళ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎలా ముందుకు సాగాల‌నేది.. ఇప్పుడు నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తోంది.

అయితే.. ఇప్ప‌టి వ‌రకు చంద్ర‌బాబు మేనిఫెస్టోపై దృష్టి పెట్ట‌లేదు. కానీ, వైసీపీ మాత్రం రెండేళ్ల ముందుగానే కొన్ని కొన్ని ప‌థ‌కాలు లీకు చేసి.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది. మ‌రి ఈ వ్యూహంలో టీడీపీఎక్క‌డో విఫ‌ల‌మ‌వుతోంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.