Begin typing your search above and press return to search.
భాష్యం వర్సెస్ పుట్టా.. సీటు ఎవరికి? బాబుకు పరీక్షే..!
By: Tupaki Desk | 17 Sep 2022 4:14 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబుకు మరో విషమ పరీక్ష ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువ అవకా శాలు ఇవ్వాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆయ నకు ఇబ్బందిగా మారిందనే సంకేతాలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని కీలకమైన నియో జకవర్గం నరసారావు పేటలో వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకుడిని నిలబెట్టాలని.. నిర్ణయించుకున్నారు. అయితే .. ఈ దఫా ఈటికెట్‌ను ఇద్దరు ఆశిస్తున్నారు. ఇద్దరూ కావాల్సిన వారే కావడం.. సామాజిక సమీకరణలు కూడా కలిసి రావడం.. చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది.
నరసారావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ కోల్పోయింది. నిజానికి ఈ సీటు పార్టీకి దక్కి ఉండాలి. ఎందుకంటే..రాజధాని నిర్మాణంతో ఇక్కడ టీడీపీ పుంజుకుందని అంచనా వేసుకున్నా రు. ఈ క్రమంలో పార్టీ ఇక్కడ గెలిచి తీరుతుందని.. అంచనా కూడా ఉంది. ఈ క్రమంలో పార్టీకి గత కొన్నేళ్లుగా.. అంటే.. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఫండింగ్ నుంచి 2014లో ఎన్నికలకు అన్ని విధాలా దోహదపడిన భాష్యం విద్యాసంస్థల అధినేతకు ఈ సీటు ఇవ్వాలని భావించారు.
అయితే.. చివరి నిముషంలో సిట్టింగ్ ఎంపీ రాయపాటి.. అలిగి.. వైసీపీలోకి వెళ్లిపోతున్నట్టు సంకేతాలు పంపించారు. దీంతో బలమైన నాయకుడిని కోల్పోతే ఇబ్బంది తప్పదని భావించిన చంద్రబాబు.. ఎట్టకేలకు ఆయనకే టికెట్ ఇచ్చారు.
అయితే.. ఆయన ఓడిపోయారు. ఇక, ఇప్పుడు. వచ్చే ఎన్నికలకు సంబంధించి నరసారావుపేటపై కసరత్తు ప్రారంభించారు. ఈ క్రమంలో భాష్యం అధినేతకు ఇవ్వాలనేది చంద్రబాబు ప్రయత్నం. ఆర్థికంగా బలంగా ఉండడం.. సామాజిక వర్గం పరంగా కూడా అనుకూలంగా ఉండడంతో ఆయన గెలుపుపై అంచనాలు ఉన్నాయి.
అయితే.. ఇంతలోనే.. పార్టీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి యనమల ఎంట్రీ ఇచ్చారని టాక్. ఆయనకు వరసకు అల్లుడు అయ్యే.. సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు.. పుట్టా మహేశ్ యాదవ్ కూడా.. నరసారావుపేట టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తాడేపల్లికి వచ్చి.. యనమల ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనకు టికెట్ ఇస్తే.. గెలిచి గిఫ్ట్‌గా ఇస్తానని.. మహేశ్ అంటున్నారు.
ఐఐటీ చదివిన మహేష్.. తన తండ్రి బాటలో రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబు అటు అన్ని విధాలా అండగా ఉన్న భాష్యం అధినేతకు టికెట్ ఇవ్వాలా.. లేక.. సీనియర్ నాయకుడు..యనమల అల్లుడికి ఇవ్వాలా.. అనే విషయంలో తీవ్రస్థాయిలో మథన పడుతున్నారని అంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఇద్దరూ కూడా యువకులే కావడం గమనార్హం. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.