Begin typing your search above and press return to search.

టీడీపీ...జిల్లాకు నలుగురు త్యాగాలు.. మధ్యవర్తిగా మాజీ మంత్రి... ?

By:  Tupaki Desk   |   10 May 2022 1:30 PM GMT
టీడీపీ...జిల్లాకు నలుగురు త్యాగాలు.. మధ్యవర్తిగా మాజీ మంత్రి... ?
X
ఏపీలో అపుడే ఎన్నికల వేడి పెరిగిపోయింది అంటున్నారు. అఖరుకు పొత్తులు సవాళ్ళు, సింహం సింగిల్ గా వస్తుంది మీరు గుంపుగా వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు, మాదే విజయం అని వైసీపీ బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక జగన్ని ఓడించాలి అంటే కొన్ని త్యాగాలు అని టీడీపీ అంటోంది. జనసేన కూడా జగన్ని ఓడించాలీ అంటే పొత్తులతోనే సాధ్యమని చెబుతోంది.

ఇక ఇందులో కూడా ఎన్నో ఎత్తులు రాజకీయాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి జనసేన అవసరం ఉంది కాబట్టి పొత్తుల విషయంలో టీడీపీ చంద్రబాబే తమ వద్దకు రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని మధ్యవర్తి ద్వారా రాయబారాన్ని టీడీపీకి పంపించారు అని కూడా అంటున్నారు.

అంటే పొత్తుల కోసం చంద్రబాబే పవన్ని స్వయంగా కలవాలి అన్నది జనసేన ఆలోచనగా కనిపిస్తోంది అన్న మాట. మొత్తానికి అటు జనసేనకు, ఇటు టీడీపీకి మధ్యవర్తి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని అంటున్నారు. గంటా ఎందుకు ఈ మధ్యవర్తి బాధ్యతలు ఎత్తుకుంటున్నారు అంటే ఆయన చంద్రబాబుకు సన్నిహితులు. అదే టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అలాగే ఆయన కూడా పవన్ సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ మరో పాయింట్.

దాంతో గంటా రంగంలోకి దిగి రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశాలు ఉన్నాయని రెండు పార్టీల వర్గాలు అంటున్నాయట. ఇక ఈసారి ఎన్నికలు టీడీపీకి అతి పెద్ద పరీక్షగా ఉన్నాయి. పైగా టీడీపీకి రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి జనసేన సీట్ల విషయంలో ఈసారి పెద్ద ఎత్తున డిమాండ్లు పెడుతుంది అని కూడా అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో జిల్లాకు నాలుగు సీట్లు వంతున జనసేన డిమాండ్ చేయవచ్చు అని చెబుతున్నారు. అయితే అన్ని సీట్లలో పోటీ చేసేందుకు జనసేనకు క్యాండిడేట్స్ ఉన్నారా అంటే లేరు. కానీ చివరి నిముషంలో వైసీపీ నుంచి జంపింగ్స్ ఉంటాయని భావిస్తున్నారు.

అదే విధంగా కనీసంగా యాభై సీట్ల దాకా డిమాండ్ చేస్తే కనీసం నలభై సీట్లు అయినా టీడీపీ నుంచి పొందవచ్చు అన్నది కూడా జనసేన ప్లాన్ గా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుకు మధ్యవర్తిగా గంటా రంగంలోకి వస్తున్నారు అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.