Begin typing your search above and press return to search.

టీడీపీ ఆ 20 చోట్ల ఇంత దారుణంగా ఉందా...!

By:  Tupaki Desk   |   11 Nov 2022 3:40 AM GMT
టీడీపీ ఆ 20 చోట్ల ఇంత దారుణంగా ఉందా...!
X
ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధిం చి ఇప్ప‌టికే అనేక వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో ముందుకు సాగుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని.. దీనిని త‌మకు అనుకూలంగా మార్చుకుని ఎన్నిక‌ల్లో విజ‌యంద‌క్కించుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది. ఇం త వ‌ర‌కు బాగానే ఉంది. అదేస‌మ‌యంలో గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు టికెట్లు ఇస్తామ‌న్నా రు. పార్టీ త‌ర‌ఫున ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. ఓకే .. ఇది కూడాబాగానే ఉంది.

అయితే.. ఎటొచ్చీ.. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏకంగా 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణం గా ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లు నాయ‌కులు క‌నిపిం చ‌డం లేదు.

మ‌రోవైపు..వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 స్థానాల్లో విజ‌యం త‌మదేన‌ని పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మ‌రి ఆయ‌నకు ఈ 20 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి తెలియ‌దా? లేదా.. తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారా? అనేది ఆసక్తిగా మారింది.

కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌తంలో నాయ‌కులు ఉన్నా.. ఇప్పుడు మాత్రం పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింది. విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, బాప‌ట్ల పార్ల‌మెంటు స్థానం, చీరాల‌, నెల్లూరు సిటీ, క‌డ‌ప‌లోని పులివెందు ల‌, రాజంపేట‌, చిత్తూరు పార్ల‌మెంటు స్థానం, తిరుప‌తి, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం, పోల‌వ‌రం, అర‌కు పార్ల‌మెంటు స్థానం, నెల్లిమ‌ర్ల నియోజ‌వ‌ర్గం, గూడూరు, నెల్లూరు పార్ల‌మెంటు స్థానం, ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం, పుంగ‌నూరు ఇలా చెప్పుకొంటూ పోతే.. 20 నియోజ‌క‌వ‌ర్గాలు పార్టీ నేత‌లు లేక‌.. బోసిపోతున్నాయి. మ‌రి ఇక్క‌డ‌.. పార్టీని న‌డిపించేవారు ఎవ‌రు అన్న విష‌యంపై పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు దృష్టి పెట్ట‌లేదు.

పోనీ.. కొత్త‌వారికైనా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాలి క‌దా అంటే.. అది కూడా చేయ‌డం లేదు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో పార్టీ ఎలా పుంజుకుంటుంది.? ఏ విధంగా ముందుకు సాగుతుంది? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజక‌వ‌ర్గాల విష‌యం తెలిసి కూడా పార్టీ అధినేతే దృష్టి పెట్ట‌లేద‌ని తెలుస్తోంది. కానీ, అధికారంలోకి వ‌స్తున్నామ‌ని మాత్రం చెబుతున్నారు. మ‌రి ఇదెలా సాధ్య‌మో.. పార్టీ ఒక‌సారి అవ‌లోకనం చేసుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.