Begin typing your search above and press return to search.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి దన్ను ఎవరు... ?
By: Tupaki Desk | 16 Sep 2021 11:30 PM GMTతెలుగు దేశం పార్టీ ఈనాటిది కాదు, నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ. అంతేనా తెలుగు ప్రజల గుండెల్లో రాముడిగా, కృష్ణుడిగా గూడు కట్టుకున్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అది. ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావాన్ని ఎపుడూ ఒక విప్లవం అని అభివర్ణించేవారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాజ్యం చేస్తోంది. పేదలు బీసీలు, బడులు అన్ని రకాలుగా అన్యాయం చేయబడి ఉన్న రోజుల్లో వారిలో రాజకీయ చైతన్యం రగిల్చి రాజ్యాధికారంలో భాగస్వాములు చేసిన ఘనత ఎన్టీఆర్‌ది. అటువంటి పార్టీ రేంజ్ చంద్రబాబు ఏలుబడిలో బాగా తగ్గిపోయింది. ప్రతీ ఎన్నికలూ ఒక వ్యూహం, పొత్తులు ఎత్తులతో టీడీపీని చంద్రబాబు తనదైన పద్ధతిలో నడిపించారు. ఇపుడు చూస్తే ఆ ఎత్తులు అన్నీ చిత్తు అవుతున్న వేళ టీడీపీ మరో సమరానికి రెడీ కావాల్సివస్తోంది.
నిజానికి టీడీపీకి 2024 ఎన్నికలు చావో రేవో అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో గెలిస్తే టీడీపీకి మరింతకాలం ఊపిరి అందుతుంది. పొరపాటున ఓడిందా ? ఇక చరిత్రలోనే టీడీపీని చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించాక గత రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడి ఇప్పుడు అక్కడ కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఇక ఏపీలో కీలకమైన 2024 ఎన్నికలలో టీడీపీకి దన్ను ఎవరు ఉంటారు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అంగ బలం, అర్ధబలం అన్నీ సమకూర్చే వారంతా ఇపుడు సైడ్ అయ్యారు.
మరోవైపు వైసీపీ సర్కార్ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోంది, కేసులు పెడుతోంది. ఒక రకంగా వారిని టార్గెట్ చేస్తోంది. ఇదే పద్ధతి లేకుండా చేస్తున్నది కాదు, పక్కా వ్యూహంతోనే అమలు చేస్తున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిస్తే ఇంతే సంగతులు అని చెప్పడానికే వైసీపీ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి వైసీపీ నుంచి వచ్చే వత్తిడులను తట్టుకుని టీడీపీకి జై కొట్టే వారు కానీ ఆర్ధిక వనరులు అందించే వారు కానీ వచ్చే ఎన్నికల్లో ఉంటారా ? అన్నది చూడాలి. అదే విధంగా టీడీపీ ఈసారి కచ్చితంగా గెలుస్తుంది అంటే కొందరైనా ధైర్యం చేసి ముందుకు వస్తారు. అలా కాకుండా పందెం కాయమంటే మాత్రం ఎవరూ అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదు.
వైసీపీ మీద ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా కూడా అదంతా టీడీపీ అనుకూల మీడియాలోనే కనిపిస్తోంది తప్ప గ్రౌండ్ లెవెల్ కి చేరడం లేదు. జగన్ సర్కార్ ఒక విధానంగా పెట్టుకుని సంక్షేమ కార్యక్రామాలను అమలు చేస్తోంది. ఓటున్న వారికే నగదు బదిలీ పధకాలు పంపిణీ అవుతున్నాయి. దాని వల్ల రేపటి ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు వైసీపీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. అదే టైమ్ లో టీడీపీ గెలవాలి అంటే సర్వ శక్తులూ ఒడ్డినా సాధ్యమా అన్నదే డౌట్ గా ఉంది. ఇక లోకేష్ ను ముంది పెట్టి చంద్రబాబు టీడీపీ రధాన్ని నడిపిస్తున్నారు.
బాబు మీద అయినా పందెం కాస్తారేమో కానీ లోకేష్ ను చూసి అండగా ఉండమంటే మాత్రం రేపటి ఎన్నికలకు కావాల్సిన సరంజామా సమకూర్చుకోవడం పసుపు పార్టీకి కష్టసాధ్యమే అంటున్నారు. మొత్తానికి టీడీపీ కూసాలను కదల్చడంతో వైసీపీ బాగానే సక్సెస్ అయింది. రేపటి రోజున టీడీపీకి అన్నీ బలాలు సమకూర్చుకోకుండా ఎక్కడికక్కడ బ్రేకులు వేసేసింది. ఇది యుద్ధ తంత్రమే అని చెప్పాలి. మరి దీని నుంచి టీడీపీ బయటపడితేనే గెలుపు వైపు ఆశగా చూడాలి.