Begin typing your search above and press return to search.

పక్కా వ్యూహంతో టీడీపీ...లెక్కలు మారుతాయా..?

By:  Tupaki Desk   |   24 Oct 2021 10:30 AM GMT
పక్కా వ్యూహంతో టీడీపీ...లెక్కలు మారుతాయా..?
X
ఏపీలో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఎన్నికలు రేపో ఎల్లుండో అన్నట్లుగానే సీన్ కనిపిస్తోంది. మరో వైపు చూస్తే టీడీపీ నేత పట్టాభి బూతులు తిట్టాడంటూ మొదలైన వివాదం కాస్తా చంద్రబాబు దీక్షల దాకా సాగింది. ఇక పోటీగా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షలకు రెడీ అయింది. ఇవన్నీ దాటి కధ ఢిల్లీకి చేరుతోంది. ఢిల్లీలో చంద్రబాబు దాదాపుగా రెండున్నారేళ్ల తరువాత అడుగు పెడుతున్నారు. చంద్రబాబు పక్కా వ్యూహంతోనే హస్తినకు చేరుకుంటున్నారు అంటున్నారు. సీనియర్ మోస్ట్ నేత అయిన బాబు ఢిల్లీ నుంచి ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రారు అనే అంటున్నారు. ఆయన చాణక్య రాజకీయం వైసీపీకి దిమ్మతిరిగే రేంజిలో ఉంటుందని కూడా చెబుతున్నారు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు, ఎవరిని కలుస్తారు అన్నదే అధికార పార్టీలో సాగుతున్న చర్చ. అఫీషియల్ గా చూసుకుంటే రాష్ట్రపతితోనే అపాయింట్మెంట్ ఉంది. మరి కేంద్ర పెద్దలను కలుస్తామని టీడీపీ ధీమాగా చెబుతోంది. సరిగ్గా ఇక్కడే వైసీపీలో కలవరం రేగుతోంది అంటున్నారు. ఇప్పటికైతే టీడీపీకి కేంద్ర నేతలు ఎవరూ అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా తెలియరావడంలేదు. అయితే ఇక్కడే టీడీపీ బిగ్ ట్విస్ట్ ని వైసీపీని చూపించబోతోంది అంటున్నారు. టీడీపీకి అపాయింట్మెంట్స్ రాకుండా వైసీపీ అడ్డుకుంటుంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో కంప్లీట్ సైలెంట్ గానే టీడీపీ ఢిల్లీ టూర్ సాగుతోంది అంటున్నారు.

ఢిల్లీలో చంద్రబాబు రెండు మూడు రోజులు ఉంటారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కలవాల్సిన వారందరినీ కలుస్తారని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంటే కచ్చితంగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలలో వీలుంటే ఇద్దరినీ లేకపోతే షా వరకైనా కలసి రాకుండా బాబు ఢిల్లీ వీడరు అన్న చర్చ కూడా సాగుతోంది. బాబుకు కనుక అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం అది వైసీపీ గుండెల్లో చలి జ్వరం తెప్పించే విషయమే అంటున్నారు. ఎందుకంటే ఏపీలో మూడేళ్ళుగా బీజేపీకి టీడీపీకి మధ్య అఫీషియల్ గా రిలేషన్స్ ఏవీ లేవు. అలాంటిది అమిత్ షా కనుక పిలిచి పెద్ద పీట వేస్తే ఏపీ రాజకీయాలలో లెక్కలు అన్నీ ఒక్కసారిగా మారడం ఖాయమే అంటున్నారు. మరో వైపు ఈ మొత్తం పరిణామాలను వైసీపీ ఆసక్తిగా గమనిస్తోంది. అయితే వైసీపీ ఎత్తులకు పై ఎత్తులనే టీడీపీ వేస్తోందని, బాబు ఢిల్లీ టూర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుందని, ఆ మీదట ఏపీ రాజకీయాలే పూర్తిగా చేంజ్ అవుతాయని తమ్ముళ్ళు అంటున్నారు. మొత్తానికి ఢిల్లీ వేదికగా ఏం జరగబోతోంది అన్న చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాలలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.