Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌ర్కార్‌పై టీడీపీ అస్త్రం... ఇదేం ఖ‌ర్మ రా బాబు..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 12:30 PM GMT
జ‌గ‌న్ స‌ర్కార్‌పై టీడీపీ అస్త్రం... ఇదేం ఖ‌ర్మ రా బాబు..!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఒక ఆస‌క్తిక‌ర కార్య‌క్ర‌మానికి తెర‌దీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కిం చుకోవాల‌ని భావిస్తున్న ఈ పార్టీ.. ఇప్ప‌టి నుంచి పార్టీ శ్రేణుల‌ను లైన్‌లో పెడుతున్న విష‌యం తెలిసిం దే. అదేవిధంగా ప్ర‌జ‌ల‌ను కూడా కార్యోన్ముఖుల‌ను చేసేందుకు రెడీ అవుతోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే అనేక కార్య‌క్ర‌మా లు చేప‌ట్టింది. బాద‌డే బాదుడు వంటి కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది.

ప్ర‌ధానంగా మాస్ జ‌నాల‌ను ఆక‌ట్టుకునేలా టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇలా అయితేనే వ‌చ్చే ఎన్నిక ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్య‌మ‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. గ‌తంలో క్లాస్ రాజకీయా లు చేసిన చంద్ర‌బాబు.. ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక పోయారు.

అయితే.. ఇప్పుడు రూటు మార్చారు. మాస్ జ‌నాల‌కు ద‌గ్గ‌రైతే.. చాలని గెలుపు గుర్రం ఎక్క‌డం సునాయాస‌మేన‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆయ‌న ఒక కీల‌క‌మైన కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు.

అయితే.. ఈ కార్య‌క్ర‌మం పేరు చాలా చిత్రంగా ఉండ‌డ‌మే ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి 'ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ!!'. టీడీపీ ఈ పేరు పెట్ట‌డానికి కార‌ణం.. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో ప్ర‌జ‌లు ఇదే త‌ర‌హా కామెంట్లుచేస్తున్నార‌ని.. అందుకే తాము ఈ పేరు ఎంచుకున్నామ‌ని స్వ‌యంగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల నోట్లో నానుతున్న మాట‌నే తాము తీసుకున్నామ‌నిఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే. ఈ పేరు పెట్ట‌డంపై భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది.

''ఇదేం ఖ‌ర్మ‌రా బాబూ..'' అనే డైలాగును వైసీపీ నేత‌లు యాంటీ ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని.. ఓ వ‌ర్గం టీడీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతున్నారు. ఇది అన‌వ‌స‌రంగా వైసీపీకి అస్త్రం ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని చెబుతున్నారు.

ఎందుకంటే.. టీడీపీ ప్ర‌భుత్వం ప‌డిపోయిన త‌ర్వాత‌.. కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేల‌కే ప‌రిమితం అయిపోయిన త‌ర్వాత‌.. వైసీపీ దాడి పెంచిన నేప‌థ్యంలో ఇప్పుడు ఇదే డైలాగ్‌ను వారు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.