Begin typing your search above and press return to search.
హుజూర్ నగర్ లో టీడీపీ భవితవ్యం ఇదీ.!
By: Tupaki Desk | 16 Oct 2019 11:23 AM GMTతెలంగాణలో టీడీపీ ఉందా అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదురు ప్రశ్నిస్తుంటాడు.. ఉంది అని ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నిరూపిస్తుంటాడు. పోయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ తన బద్దశత్రువు అయిన కాంగ్రెస్ తో కలిసి పోరాడింది.. పోటీచేసింది. మొత్తం 119 స్థానాల్లో కేవలం 2 స్థానాలు..అదీ ఆంధ్ర ప్రాబల్యమున్న ఖమ్మం జిల్లాలో గెలుచుకుంది.
అయితే ఏపీలో చంద్రబాబు చిత్తుగా ఓడడం.. తెలంగాణలో టీడీపీ నేతలంతా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - బీజేపీలో చేరిపోవడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమైంది. మరి ఈ సమయంలో హుజూర్ నగర్ ఎన్నికలు వచ్చాయి. తన పాత ఫ్రెండ్ టీడీపీ తనకు మద్దతిస్తుందని కాంగ్రెస్ భావించింది. కానీ పొత్తు కుదరదని చంద్రబాబు హుజూర్ నగర్ లో అభ్యర్థిని ప్రకటించి కాంగ్రెస్ కు ‘హ్యాండ్ ’ ఇచ్చాడు. సో ఇప్పుడు హుజూర్ నగర్ లో మిత్రులైన టీడీపీ - కాంగ్రెస్ లు వేరువేరుగా పోటీచేస్తున్నాయి..
అయితే తెలంగాణలో అస్సలు నడిపించే నాయకులు - నేతలు - కార్యకర్తలు లేని టీడీపీ.. ఈ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకుంటుందా అన్న అనుమానాలు చెలరేగాయి.. దీనిపై తాజాగా ‘తుపాకీ.కామ్’ పోల్ పెట్టింది. ఈ పోల్ లో ఆసక్తికర ఫలితం వచ్చింది..
తుపాకీ.కామ్ పోల్ లో మెజార్టీ నెటిజన్లు హుజూర్ నగర్ లో టీడీపీకి డిపాజిట్ రాదని స్పష్టం చేశారు. దాదాపు 65.15శాతం మంది టీడీపీకి డిపాజిట్ రాదని తేల్చిచెప్పారు. ఇక డిపాజిట్ దక్కుతుందని 30.23 శాతం మంది.. ఏమో చెప్పలేం అంటూ 4.62 శాతం మంది పేర్కొన్నారు.
ప్రజాభిప్రాయం ప్రకారం హుజూర్ నగర్ లో టీడీపీకి డిపాజిటే రాదని తేలింది. సో ఇక గెలవడం మాట అటుంచి ఓట్లు ఎన్ని సంపాదిస్తుందన్న దానిమీద ఆ పార్టీ మనుగడ తెలంగాణలో ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.