Begin typing your search above and press return to search.
జమ్మలమడుగులో టీడీపీ క్లోజేనా?
By: Tupaki Desk | 7 Sep 2019 4:37 AM GMTకడప జిల్లా జమ్మలమడుగులో త్వరలోనే టీడీపీ ఖాళీ కానుందన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఏపీ సీఎం - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం - ఆది నుంచి టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం కావడంతో జమ్మలమడుగుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగానే దృష్టి సారించారు. అయినా కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగానే తుడిచిపెట్టుకుపోనుందట. వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఈ మాట నిజమేనన్న వాదన అంతకంతకూ బలపడుతోంది. జమ్మలమడుగులో పార్టీని తిరుగులేని స్థితిలో ఉంచేందుకు చంద్రబాబు యత్నిస్తే... ఇప్పుడు ఆ యత్నాల ఫలితమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్న వాదనా వినిపిస్తోంది. పార్టీ బలోపేతానికి చంద్రబాబు కష్టపడితే... ఇప్పుడు అక్కడ పార్టీనే అడ్రెస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చిందంటే... ఆసక్తికరమే కదా. ఈ కథేమిటో చూద్దాం పదండి.
కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లున్నా... జమ్మలమడుగు సీటుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ టీడీపీకి వీర విధేయుడిగానే కాకుండా టీడీపీ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నేతగా రామసుబ్బారెడ్డి ఫ్యామిలీ ఎదిగింది. వైఎస్ జమానా నుంచి ప్రస్తుతం జగన్ దాకా ఈ నియోజకవర్గంపై తమదైన శైలి వ్యూహాలు రచించినా... రామసుబ్బారెడ్డి వెనక్కు తగ్గింది లేదు. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడం - 2014 ఎన్నికల్లో టీడీపీ నవ్యాంధ్రలో అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటమిపాలు కావడంతో జమ్మలమడుగులో రాజకీయం మారిపోయింది. అప్పటిదాకా వైసీపీలో ఉండి - ఆ పార్టీ ఎమ్మెల్యేగానే గెలిచిన చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి జంప్ కొట్టేశారు. ఫలితంగా బాబు కేబినెట్ లో మంత్రి పదవినీ దక్కించుకున్నారు.
అయితే ఆదినారాయణ రెడ్డి ఫ్యామిలీతో ఏళ్లుగా కొనసాగుతున్న వైరాన్ని గుర్తు చేసిన రామసుబ్బారెడ్డి... చదిపిరాళ్ల ఫ్యామిలీని టీడీపీలోకి రాకుండా అడ్డుకునే యత్నం చేశారు. అయితే అప్పటికప్పుడు రంగంలోకి దిగిన చంద్రబాబు... ఇరు వర్గాలను తన వద్దకు పిలిపించుకుని పలుమార్లు రాయబారం నెరిపారు. ఇద్దరూ కలిస్తే జమ్మలమడుగులో పార్టీకి తిరుగుండదని - ఇద్దరికీ ఇది కలిసి వస్తుందని పదే పదే చెప్పారు. అంతేకాకుండా ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరినా... రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యమేమీ తగ్గించేది లేదని కూడా హామీ ఇచ్చారు. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు పదే పదే చెబుతున్న నేపథ్యంలో అయిష్టంగానే అయినా ఆదినారాయణ రెడ్డి చేరికకు రామసుబ్బారెడ్డి ఎట్టకేలకు ఓకే అన్నారు. వెరసి అక్కడ వైసీపీకి కొత్త నేత తప్పలేదు. పార్టీకి కేడర్ ఉన్నా... నడిపించే నేత లేక కొన్నాళ్లు ఇబ్బంది పడింది.
అయితే 2019 ఎన్నికలు వచ్చేనాటికి జమ్మలమడుగులో వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న సుధీర్ రెడ్డి... ఇటు రామసుబ్బారెడ్డితో పాటు అటు ఆదినారాయణ రెడ్డిలకు ఝలక్ ఇచ్చారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామసుబ్బారెడ్డిని సుధీర్ రెడ్డి చిత్తుగా ఓడించేశారు. రామసుబ్బారెడ్డికి మద్దతుగా కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి సహకరించినా ఫలితం లేకపోయింది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డితో పాటు కడప పార్లమెంటుకు వెళ్లిన ఆదినారాయణ రెడ్డి కూడా చిత్తుచిత్తుగా ఓడారు. ప్రత్యర్థులుగా ఉండి స్నేహితులుగా మారిన ఇద్దరూ ఓడిపోవడంతో రామసుబ్బారెడ్డి - ఆదినారాయణరెడ్డిలు డైలమాలో పడిపోయారు.
ఇక జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో వైసీపీ జమ్మలమడుగులో తనదైన స్పీడుతో దూసుకెళ్లింది. ఫలితంగా ఇప్పుడు రామసుబ్బారెడ్డి వైసీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారట. అదే సమయంలో టీడీపీలో కొనసాగలేనంటూ ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి చేరిపోయేందుకు సిద్ధమైపోయారు. ఈ మేరకు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరికకు సంబంధించి పూర్తి క్లారిటి వచ్చేసింది. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి చేరికపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా... దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే జరిగితే... ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డిలను కలిపిన చంద్రబాబు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. అంతేకాదండోయ్... వారిద్దరూ కలిస్తే జమ్మలమడుగులో టీడీపీకి తిరుగుండదని బాబు భావిస్తే... ఇప్పుడు అక్కడ టీడీపీనే అడ్రెస్ లేకుండా పోతోందన్న వాదనలూ ఆసక్తి రేపుతున్నాయి.