Begin typing your search above and press return to search.
టీడీపీకి తెలంగాణలో ఈ పరిస్థితి ఏంటి బాబు?
By: Tupaki Desk | 6 Nov 2016 5:30 PM GMTతెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంటే ఒకప్పుడు ఉన్న క్రేజ్ వేరు. సార్వత్రికం మొదలుకొని స్థానికం వరకు ఎన్నికలు ఏవైనా అయితే అధికారం లేదంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర తప్పనిసరిగా టీడీపీదే. కానీ ఆ పార్టీ ఇపుడు తెలంగాణలో వెలిసిపోతోంది. అది కూడా టీడీపీకి కంచుకోట వంటి ఖమ్మం జిల్లాలో కనీసం పార్టీ సారథిని కూడా నియమించుకోలేని స్థితికి చేరడం గమనార్హం. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్లను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. తెలంగాణలోని మొత్తం 31 జిల్లాలకుగానూ ఖమ్మం - కొత్తగూడెం మినహా మిగతా 29 జిల్లాలకు కన్వీనర్లను నియమించారు. ఒకనాడు ఏకచత్రాదిపత్యం లాగా ఉన్న ఖమ్మం జిల్లా - అందులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభావం అధికంగా ఉండే సరిహద్దు జిల్లాలో సారథి లేకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ అడ్ హక్ కమిటీ కన్వీనర్లను నియమిస్తూ తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రకటించారు. తెలుగుదేశం వర్గాల సమాచారం ప్రకారం... పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు కొత్త జిల్లాలకు అడ్ హక్ కమిటీల కన్వీనర్లను నియమించి వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. సభ్యత్వ నమోదు అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకుని మహానాడు నాటికి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాకు లోలం శ్యాంసుందర్ ను కన్వీనర్ నియమించారు. అలాగే యూనుస్ అక్బానీ (ఆదిలాబాద్) - బోడ జనార్దన్ (మంచిర్యాల) - అబ్దూల్ కలాం (కొమురంభీం-ఆసిఫాబాద్) - అరికెల నర్సారెడ్డి (నిజామాబాద్) - సుభాష్ రెడ్డి (కామారెడ్డి) - సీహెచ్ విజయ రమణారావు (పెద్దపల్లి) డాక్టర్ కె.సత్య నారాయణ (కరీంనగర్) - అలినేని సాగర్‌రావు (జగిత్యాల) - అన్నమనేని న ర్సింగరావు (సిరిసిల్ల-రాజన్న) - ఎస్.యాద వరెడ్డి (సంగా రెడ్డి ) - బట్టి జగపతి (మెదక్) - ఒంటేరు ప్రతాపరెడ్డి (సిద్దిపేట) - ఎన్. శ్రీనివాస్ - కన్వీనర్ - సారంగపాణి కో-కన్వీనర్ (హైదరాబాద్) - సుభాష్ యాదవ్ (వికారాబాద్) - సామ రంగారెడ్డి (రంగారెడ్డి) - టి.జంగయ్య యాదవ్ (మేడ్చల్-మల్కజ్ గిరి) - బి.నర్సింహులు (మహబూబ్ నగర్) - బి.రాములు (వనపర్తి) - డాక్ట ర్ పి.శ్రీనివాస్ రెడ్డి (నాగర్ కర్నూల్) - ఎస్.రామచంద్రా రెడ్డి (గద్వాల-జోగు లాంబ) - బిల్యా నాయక్ (నల్లగొండ) - రమేష్ రెడ్డి (సూర్యాపేట) - ఎ.సందీప్ రెడ్డి (యాదాద్రి- భువన గిరి) - జి.సత్యనారాయణరావు (భూపాలపల్లి-జయశంకర్) - గన్నో జు శ్రీనివాసచారి (వరంగల్ రూరల్) - ఈగ మల్లేశం (వ రంగ ల్ అర్బన్) - ఉదయ్ చందర్ (మహబూబాబాద్) - కొండా మధుసూదన్ రెడ్డి (జనగాం)లను కన్వీనర్లుగా నియమించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/