Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఇంత చీప్ అయ్యారా...?

By:  Tupaki Desk   |   17 Nov 2022 8:30 AM GMT
చంద్రబాబు ఇంత చీప్ అయ్యారా...?
X
తెలుగుదేశం పార్టీలో సీటు ఇచ్చేది, బీ ఫారం ఇచ్చేది చంద్రబాబు అని అందరికీ తెలుసు. కానీ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి అయిన దామచర్ల జనార్ధన్ గిద్దలూరు సీటుకు టీడీపీ క్యాండిడేటును తనే అనౌన్స్ చేసేస్తున్నారు అంట . ఈ పరిణామం టీడీపీని దశాబ్దాలుగా చూస్తున్న వారికి షాకింగ్ గా మారుతోంది. ఎందుకంటే చంద్రబాబు అధినేతగా ఉండి కూడా దామచర్ల ఇలా చేస్తున్నారు అంటే ఆయన అంతలా చీప్ అయ్యారా అని అంటున్నారు.

నిజానికి దామచర్ల జనార్ధన్ కి అంత సీన్ లేదు కానీ ఆయన రాజకీయ ఆరాటంతోనే ఈ రకంగా ప్రకటించుకుంటున్నారు అని అంటున్నారు. వాస్తవానికి చూస్తే టీడీపీ జనసేన పొత్తులు ఉంటే కనుక జనసేన పార్టీ ఒంగోలు, గిద్దలూరు, దర్శి సీట్లను కోరుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. ఈ విషయం అలా ఉండగానే ఏకంగా దామచర్ల జనార్ధన్ మాత్రం గిద్దలూరు సీటుకు తన క్యాండిడేచర్ ని ప్రకటించుకోవడం అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది.

ఈ పరిణామాలను టీడీపీలో గమనిస్తున్న తమ్ముళ్ళు అయ్యో పాపం చంద్రబాబు అని అంటున్నారు అంట. చంద్రబాబు మరీ అంత చీప్ అయ్యారా అని కూడా వారు అంటున్నారు అంట . జనార్ధన్ వ్యవహారం చూస్తే ఆయన పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే ఒకే ఒకసారి గెలిచిన చరిత్ర ఉంది. అయితే మాత్రం జిల్లా పార్టీ అంతా తనదే అని ఆయన పెత్తనం చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక దామచర్ల జోరు మీద ఆయన దూకుడు మీద ఇప్పటికే కొంతమంది నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా చెబుతున్నారు . అయినా కూడా దామచర్ల ఎక్కడా తగ్గడంలేదు. నేను అంతా చూసుకుంటాను అనే తన సహచరులతో అంటున్నారుట. ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో వైసీపీ వీక్ అవుతోంది. ఆ పార్టీలో ఉన్న వర్గ పోరు వల్ల టీడీపీకి ఈసారి బాగా ప్లస్ అవుతుంది అన్న లెక్కలు ఉన్నాయి.

ఇలాంటి పరిస్థితులలో సొమ్ము చేసుకోవాల్సిన టీడీపీని దాంచర్ల రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. పొత్తులు ఉంటే కనుక ప్రకాశం జిల్లాలో జనసేన టీడీపీకి రెండింటికీ మేలు జరుగుతుంది. అందువల్ల టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఎంత పెద్ద లీడర్ అయినా పక్కన పెడుతుంది అని అంటున్నారు. జనసేన కోరుకున్న సీట్లు ఇవ్వడానికే మొగ్గు చూపుతుంది అని చెబుతున్నారు.

అయితే దామచర్ల మాత్రం గిద్దలూరు మీద కర్చీఫ్ వేసేసి తన మాటే శాసనం అంటూ ముందుకు పోతే అసలుకే ఎసరు వస్తుంది అని అంటున్నారు. ఆయన పార్టీ కోసం నిలబడితే మాత్రం ఈ రకమైన ప్రకటనలు చేయరని అంటున్న వారూ ఉన్నారు. మరికొందరు అయితే చంద్రబాబుకు ఏమి చేయాలో తెలుసు.

సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకుంటారని, దామచర్ల సీట్ ఫీట్ కి గట్టిగానే జవాబు ఉంటుందని కూడా అంటున్నరు. చూడాలి మరి. బాబు నమ్మినంద్నుకు బాధ్యతలు ఇచ్చినందుకు దామచర్ల ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తనకు అనుకూలంగా తీసుకోవడం మాత్రం చేటు తెస్తుందనే అంటున్నారుట అంతా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.