Begin typing your search above and press return to search.

కొడాలి నానిని టార్గెట్‌ చేశారా.?

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:13 PM GMT
కొడాలి నానిని టార్గెట్‌ చేశారా.?
X
కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాల్లో సంచలనం. రెండు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా నాని.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కూడా బంపర్‌ మెజారిటీతో గెలిచారు. గుడివాడ టీడీపీకి దక్కకపోవడం ఒక అవమానం అయితే… కొడాలి నాని డైరెక్ట్‌ గా చంద్రబాబునే టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తుంటారు. బాలకృష్ణ అంతటివాడే.. గుడివాడలో నానికి పోటీగా వేయలేక హిందూపూర్‌ వెళ్లాడు. అలాంటి గుడివాడపై వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరెయ్యాలనేది చంద్రబాబు వ్యూహంగా కన్పిస్తోంది. అందువల్ల.. రెండు రోజుల్లో గుడివాడ నాయకులతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. అన్నింటికి మించి.. ఈసారి గుడివాడలో గట్టి టీడీపీ అభ్యర్థిని నిలిపి ఎలాగైనా సరే గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా స్థానిక నేత రావి వెంకటేశ్వరావుతో పాటు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్‌ పేర్లు కూడా విన్పిస్తున్నాయి.

రావి వెంకటేశ్వరరావు స్థానిక నేత. పార్టీలో మంచి పట్టుంది. కానీ గుడివాడలో మాత్రం నాని ధాటికి తట్టుకుని గెలవలేకపోతున్నారు. దీంతో.. ఈసారి రావి ప్లేస్‌ లో అవినాష్‌ ని రంగంలో దించాలని భావిస్తున్నారు. దేవినేని అవినాష్‌ ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాడు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. దీంతో.. అవినాష్‌ అయితే నానిని ఢీకొట్టి గెలవగలడని చంద్రబాబు ప్లాన్‌. కానీ మూడు సార్లు నాన్‌ స్టాప్‌ గా గెల్చిన వ్యక్తిని ఢీకొట్టే సత్తా అవినాష్‌ కు ఉందని చెప్పలేం. గుడివాడ ప్రజలు నాని ఉన్న పార్టీని కాకుండా నానిని చూసి ఓటేస్తున్నారు. సో.. నాని లాంటి గట్టి లీడర్‌ని ఢీకొట్టాలంటే కష్టమే మరి. అందుకే చంద్రబాబు రంగంలోకి దిగారు. మరి ఈసారైనా చంద్రబాబు వ్యూహాలు గుడివాడలో ఫలిస్తాయా. వెయిట్‌ అండ్‌ సీ.