Begin typing your search above and press return to search.
మీ మామను తీసుకురా : బ్రహ్మాపై ఒత్తిడి!
By: Tupaki Desk | 2 Aug 2017 9:15 AM GMTశిల్పా చక్రపాణి రెడ్డి తమను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడాన్ని తెలుగుదేశం పార్టీ ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతోంది. నంద్యాల ఉప ఎన్నికలో ఏదో ఒకవిధంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీకి.. తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్యర్థి కావడం, తాము ఎమ్మెల్సీ చేసిన చక్రపాణి ఇవాళ వైకాపాలో చేరడం తొందరగా మింగుడుపడకపోవచ్చు. అయితే.. తాజా సమీకరణాల నేపథ్యంలో తెలుగుదేశం కొత్త వ్యూహంతో తమ ప్రతిష్ట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నంద్యాల తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి - స్వయానా మామ అయిన కాటసాని రామిరెడ్డిని వైకాపాలోంచి తెదేపాలోకి తీసుకురావాలని ఒత్తిడి పెంచుతున్నట్లుగా పుకార్లు వినవస్తున్నాయి.
వైకాపా ఒక స్కెచ్ ఫాలో అయితే.. దానికి రిటార్టుగా తాము కూడా మరో స్కెచ్ వెతుక్కోవాలనేది తెదేపా నీతిగా ఉంది. మొత్తానికి భూమాను చేర్చుకున్న తరువాత శిల్పాసోదరులను పార్టీలో నిలబెట్టుకోలేకపోయిన తెలుగుదేశం.. అందువల్ల పోయిన ప్రతిష్టను కొంతమేరకైనా భర్తీ చేసుకోవాలంటే.. వైకాపా నుంచి ఎవరినైనా తమ వైపు లాక్కోవాలని పావులు కదపడం సహజం. అందుకే ప్రస్తుతం బనగానపల్లె నియోజకవర్గానికి వైకాపా ఇన్ ఛార్జిగా ఉన్న కాటసాని రామిరెడ్డిని తెదేపాలోకి తీసుకురావాలని అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారట.
కాటసాని రామిరెడ్డి.. జిల్లాలో పట్టు ఉన్న సీనియర్ నాయకుల్లో ఒకరు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆ తర్వాతి పరిణామాల్లో జగన్ పార్టీలో చేరారు. ఆయన కూతురునే, ప్రస్తుత తెదేపా నంద్యాల అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి వివాహం చేసుకున్నారు.
ఈ బంధుత్వాన్ని అడ్డుగా పెట్టి.. ఆయనను పార్టీలోకి లాగాలని తెలుగుదేశం పావులు కదుపుతోంది. శిల్పా సోదరులకు దక్కిన అనాదరణ దృష్ట్యా తొలుత మోహన్ రెడ్డి - బుధవారం చక్రపాణి రెడ్డి వైకాపాలోకి వెళ్లిపోయారు. కానీ కాటసాని తెదేపాలోకి రావడానికి అక్కడ ఆయనకు అసంతృప్తులేమీ లేవు. మరి బంధుత్వాన్ని వాడుకుని.. రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్న తెదేపా వ్యూహం ఎలా సాగుతుందో చూడాలి.