Begin typing your search above and press return to search.
భారీ కసరత్తు తర్వాతా మరీ ఇంత రచ్చ ఏంది బాబు?
By: Tupaki Desk | 20 March 2019 3:30 PM GMTరోజుల తరబడి భారీఎత్తున డేటాను చుట్టు పరుచుకొని.. సామాజిక సమీకరణాలు.. ఆర్థిక అంశాలు.. దాదాపు పదికి పైగా సర్వే ఫలితాలు.. ఐవీఆర్ ఎస్ రిజల్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కసరత్తు జరిగిన తర్వాత.. విపక్షం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తర్వాతే ఏపీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ అధినేత తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరింత కసరత్తు చేసిన తర్వాత రిలీజ్ అయిన జాబితాపై తెలుగుతమ్ముళ్లు రియాక్షన్ మామూలుగా లేదు.
టికెట్ల కేటాయింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారు.. ఏకంగా బాబు ఇంటి వద్దకు వచ్చి రచ్చ చేస్తున్నారు. దీంతో.. అసంతృప్తుల ఆగ్రహం పార్టీ అధినేతకు పెద్ద తలనొప్పిగా మారింది. మొదట్నించి హామీలు ఇచ్చి చివర్లో హ్యాండిస్తారా? అంటూ బాబుపై గుస్సా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా రచ్చ చేస్తున్న వారిలో ప్రముఖంగా మాచర్ల అసెంబ్లీ బరిలో దిగుతున్న అన్నపురెడ్డి అంజిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. ఫ్లకార్డులు పట్టుకొని సీఎం నివాసం ఎదుట వారు నిరసన ప్రదర్శనతో పాటు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కనీసం పార్టీ సభ్యత్వం లేని వారికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి కాకుండా ఇలా ఎవరికి పడితే వారికి సీట్లు ఎలా కేటాయిస్తారని వారు మండిపడుతున్నారు. టికెట్ల పంపిణీలో అసంతృప్తి మామూలే కానీ.. మరీ ఈస్థాయిలో అధినేత ఇంటి ఎదుటకు వచ్చి మరీ రచ్చ చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.