Begin typing your search above and press return to search.
నిన్న ఖమ్మం.. నేడు నిజామాబాద్.. ఆంధ్రులున్న చోట పాతుతున్న టీడీపీ జెండా
By: Tupaki Desk | 31 Dec 2022 2:30 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్’ అంటూ ఇంకా విస్తరణ బాట పట్టకుండానే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిన పార్టీని తెలంగాణలో బతికించుకునేందుకు అడుగులు వేస్తున్నాడు. ఇటీవలే ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించి జోష్ నింపిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రులు అత్యధికంగా ఉండే నిజామాబాద్ ను టార్గెట్ చేశారు. అక్కడ మండవ వెంకటేశ్వరరావు లాంటి మాజీ టీడీపీ మంత్రులు ఉంటున్నారు. వారిని మళ్లీ యాక్టివ్ చేయాలని..టీడీపీలోకి తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నారు.
టీడీపీ మొదట ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఊపిరిలూదింది. ఆ సభలో పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణలో విస్తరిస్తామని ప్రకటించారు. త్వరలోనే నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని వీడి వెళ్లినవంతా తిరిగిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రేవంత్ రెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మిగతా వారు టీఆర్ఎస్ ,. బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం సభతో ఊపుతెచ్చారు. ఇప్పుడు నిజామాబాద్ లాంటి ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే చోట జెండా పాతాలని చూస్తున్నారు.
నిజామాబాద్ లో చాలామంది టీడీపీ నాయకులు చంద్రబాబుకు టచ్ లో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి మంచి క్యాడర్ ఉండడంతో ఆ జిల్లాలో కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ రూరల్ , బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
జనవరి చివరివారంలో బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చంద్రబాబుతోపాటు ముఖ్యమైన నాయకులు కొందరినీ ఆహ్వానించి వారి సమక్షంలో పార్టీలో చేరికలను ప్రోత్సహించాలనుకుంటున్నారు. మరి టీడీపీ విస్తరణకు అడుగులు పడ్డట్టే కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.