Begin typing your search above and press return to search.
బాబు ధర్మరాజు కాలేకపోతున్నారు ఎందుకు?-2
By: Tupaki Desk | 15 Dec 2015 4:10 AM GMTఆంధ్రప్రదేశ్ లోని పంచాయతీల సర్పంచులు పాపం గోళ్లు గిల్లుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో సిమెంటు రోడ్లు - ఇందిరమ్మ ఇళ్లు - పంచాయతీల భవనాలు - తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు వంటి కాంట్రాక్టు పనులు చేసి బాగానే లబ్ధి పొందిన సర్పంచులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ అధికారంలో కోల్పోవడంతో ఆ పార్టీ సర్పంచులకు ఎదురవుతున్న అనుభవం అనుకుంటే పొరపాటే.. అధికార పార్టీ టీడీపీకి చెందిన సర్పంచులదీ ఇప్పుడు అదే పరిస్థితి. వారూ గోళ్లు గిల్లుకుంటున్నారు. చేయడానికి పనుల్లేక..చేతి ఖర్చులు పెట్టలేక ఎందుకు గెలిచాంరా బాబూ అనుకుంటున్నారట. లక్షలు, కోట్లు ఖర్చు చేసి గెలిచిన సర్పంచులకు పైసా పని దొరక్క కటకటలాడుతున్నారు. దీంతో తమపై గెలిచి సర్పంచులైనవారిని చూసి వారి ప్రత్యర్థులు ఇప్పుడు తెగ ఆనందిస్తున్నారట.
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చి ఏడాదిన్నరైనా కూడా ఆ పార్టీ సర్పంచులకు పనులు దక్కడం కానీ, పంచాయతీలకు నిధులివ్వడం కానీ చేయలేదు. దీంతో వారు సర్పంచులగా నిలదొక్కుకోవడానికి కానీ, రాజకీయంగా మనుగడ సాధించడానికి కానీ ఏమాత్రం వీలు లేకపోతోంది. పలుమార్లు సర్పంచులు సంఘం ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే అయిదేళ్లు సర్పంచి పదవిలో ఉండలేమని చాలామంది అంటున్నారు.
ఇటీవల కృష్ణా జిల్లాలో మచిలీపట్నం - పరిసర మండలాలకు చెందిన టీడీపీ సర్పంచులంతా సమావేశమవడం సంచలనంగా మారింది. అధికార పార్టీ సర్పంచులుగా ఉండి కూడా గ్రామాల్లో పనులు చేయించలేకపోవడం... ఎందుకూ కొరగానివారిగా మిగిలిపోతుండడంపై వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ వేడి ముదిరితే పార్టీకి ఇబ్బందని... విపక్షాలు దాన్ని సొమ్ము చేసుకుంటాయని భావించి అక్కడి ప్రజాప్రతినిధులు వారిని చల్లబరిచారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్తితే ఇలా ఉంటే కార్యకర్తల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. 'చంద్రబాబు ఇకనైనా మేలుకుని ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలనూ గమనించుకోవాలని' తెలుగు తమ్ముళ్లు ఆ చెవిన ఈ చెవిన వేస్తూ బాబుకు చేరుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చంద్రబాబుకు వారి మాటలు చేరుతాయా?