Begin typing your search above and press return to search.
టీడీపీ వైసీపీ...రెండింటిలోనూ అగ్గి రాజేసిన మాజీ మంత్రి
By: Tupaki Desk | 22 Jan 2023 8:37 AM GMTఆయన సీనియర్ మోస్ట్ నేత. తెలుగుదేశం పార్టీకి ఎంతటి చరిత్ర ఉందో ఆయనకూ ఉంది. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన తెలుగుదేశం పొలిటిక్ బ్యూరో మెంబర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆయన మాట్లాడితే ఫిరంగులే మోగుతాయి. స్వపక్షంగా విపక్షమా అని ఎక్కడా చూడరు. ఆయన తన మర్క్ మంటతో అంటించి పారేస్తారు. ఆయన ఒకే ఒక మీడియా మీటింగుతో ఇటు అధికార వైసీపీకి అటు టీడీపీకి కూడా అగ్గి పెట్టేశారు.
ఎవడా గంటా అంటూ సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రిని ఒక రేంజిలో వేసుకున్న అయ్యన్న వైసీపీ మీద నల్లేరు మీద నడక అన్నట్లుగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన అనుచితమైన వ్యాఖ్యలే చేశారు. మొత్తానికి దుమ్ము దులిపేసేలా అయ్యన్న రాజకీయ కామెంట్స్ ఉన్నాయి.
ఈ జడివానకు స్వపక్షంలోనూ కలకలం రేగుతోంది. వారు అయితే అయ్యన్న నోటి ధాటికి ఏమి చేయాలా అని తర్జన భర్జన పడుతున్నారు. మాజీ మంత్రి గంటా అయితే అయ్యన్న చేసిన కామెంట్స్ పట్ల తీవ్రంగా మనస్థాపం
చెందుతున్నారని అంటున్నారు. తన మీద ఏక వచన ప్రయోగం చేస్తూ చులకనగా అయ్యన్న మాట్లాడడం పట్ల మాజీ మంత్రి మండుతున్నారు. దీని మీద అధినాయకత్వం దృష్టికి తీసుకు వచ్చి ఏదో ఒకటి చేయాలని ఆయన మీద అనుచరుల నుంచి వత్తిడి పెరుగుతోంది.
ఇంకో వైపు చూస్తే అయ్యన్న జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు ఇలా చేశారో లేదో అలా జిల్లాకు చెందిన మంత్రి బూడి ముత్యాలనాయుడు నుంచి నర్శీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ తో పాటు ఎక్కడో ఉన్న నాయకులు కూడా రెస్పాండ్ అవుతునారు. అయ్యన్నకు పిచ్చి పట్టింది అని బూడి ముత్యాలనాయుడు తేల్చేశారు.
ఇక పెట్ల ఉమాశంకర్ అయితే అయ్యన్న అతి పెద్ద సైకో అని బూతుల నాయకుడు అంటూ దుయ్యబెట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అయితే అయ్యన్న పిచ్చి కలలకు కనకు, మీ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదు, అలాగే నీవు ఇక జీవితంలో మంత్రి అయ్యే చాన్సే లేదు అని గట్టిగానే తగులుకున్నారు. మా నాయ్కుడి మీద విమర్శలు చేస్తే పెద్ద లీడర్ వి అవవు, అనుచితమైన కామెంట్స్ చేస్తూ పరువు తీసుకుంటున్నావు అని రిటార్ట్ ఇచ్చారు.
ఇక మరో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అయితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అయ్యన్న, చంద్రబాబు అచ్చెన్నాయుడు వీరి ముగ్గురు భాషను ప్రజలు ఎనాడో చీత్కరించుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్న అయ్యన్న ఆశలు నీరుకాక తప్పదని ఆయన స్పష్టం చేశారు అయ్యన్న కంటే అతి పెద్ద భూకబ్జా దారు వేరొకరు లేరని ఆయన సరికొత్త ఆరోపణ చేశారు.
అయ్యన్న మాత్రమే కాదని, టీడీపీ నాయకులు అంతా భూ కబ్జాదారులే అని నారాయణస్వామి మండిపడ్డారు. అయిదేళ్ళ చంద్రబాబు అద్వాన్న పాలనను చూసిన ఏపీ ప్రజలు ఇక మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి రానీయరు అని ఆయన జోస్యం చెప్పారు. అయ్యన్న తన కామెంట్స్ తో తెలుగుదేశానికి తీరని నష్టం కలిగించాడని ఆయన మీద చర్యలు తీసుకోవాలని నారయానస్వామి డిమాండ్ చేశారు. అయితే అయ్యన్న విషయంలో తెలుగుదేశం చర్యలకు దిగుతుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
అయ్యన్న ఫైర్ బ్రాండ్ అని తెలిసి తెలిసి ఆయన మీద ఈ కీలకమైన ఎన్నికల వేళ చంద్రబాబు యాక్షన్ కి దిగుతారు అంటే ఎవరూ నమ్మేది లేదు అంటున్నారు. గతంలో కూడా ఇంతకంటే ఎక్కువగానే అయ్యన్న మాట్లాడారని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు గుడ్డలూడదీసి తంతారు అని అయ్యన్న ఏకంగా అధినాయకత్వం మీదనే ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇపుడు అయ్యన్న మీద ఏ యాక్షన్ ఉండదని సర్దుకుపోవడమే చేస్తారని అంటున్నారు.