Begin typing your search above and press return to search.
గుంటూరు టీడీపీలో బిగ్ వికెట్ డౌన్
By: Tupaki Desk | 9 July 2019 11:48 AM GMTఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయిన టిడిపికి వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఎప్పుడు.. ఎవరు ? బయటకు వెళ్లి పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఏపీలో పాగా వేసేందుకు కాచుకొని కూర్చుని ఉన్న బిజెపి.. టిడిపి నుంచి ఎవరు వచ్చినా కండువాలు కప్పేస్తోంది. ఇప్పటికే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా బిజెపిలో చేరి పోయారు. తాజాగా రాజధాని జిల్లా గుంటూరుకు చెందిన టీడీపీ కీలక నేత చందు సాంబశివరావు పార్టీ సభ్యత్వంతో పాటు... పార్టీ పదవికి రాజీనామా చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే బిజెపిలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
గుంటూరు జిల్లాలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న సాంబశివరావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన కొన్ని దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యశించిన సాంబశివరావు నాసా... ఇస్రోలో శాస్త్రవేత్తగా పని చేశారు. చంద్రబాబు ఆదేశానుసారం 2004లో దుగ్గిరాల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఆయన 2014 - 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డారు. తాజా ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా వెస్ట్ సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా... చంద్రబాబు మాత్రం సామాజిక సమీకరణలు అంటూ ఆయనను పక్కన పెట్టేశారు.
పార్టీలో సరైన ప్రయారిటీ లేకపోవడంతో పాటు... తాజా ఎన్నికల్లో ఘోరపరాజయంతో టీడీపీకి భవిష్యత్తు లేకపోవడంతోనే ఆయన పార్టీ వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా టీడీపీ ఇన్ చార్జ్ గా కొనసాగుతున్నారు. ఈ జిల్లాకే చెందిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చందు సాంబశివరావును బీజేపీలోకి ఆహ్వానించారని.. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారే ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఏదేమైనా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో సిన్సియర్‌గా పనిచేస్తోన్న సాంబశివరావు లాంటి వ్యక్తులు పార్టీని వీడడం టీడీపీకి తీరని నష్టం.