Begin typing your search above and press return to search.

టీడీపీ ముఖ్యుడికి గాలం వేస్తున్న కాంగ్రెస్‌?

By:  Tupaki Desk   |   20 Aug 2019 6:05 AM GMT
టీడీపీ ముఖ్యుడికి గాలం వేస్తున్న కాంగ్రెస్‌?
X
ఇప్ప‌టికే తెలంగాణ‌ ఉనికి కోల్పోయి...పార్టీ చ‌రిత్ర‌ల్లో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేని స్థితికి చేరిపోయిన సైకిల్ పార్టీకి మ‌రింత షాక్ ఇచ్చేలా ప‌రిణామాలు మారుతున్నాయి. ఇప్ప‌టికే ముఖ్య‌నేత‌లు అధికార టీఆర్ ఎస్ పార్టీలోకి - ప్ర‌తిప‌క్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీలో చేరిపోగా....మిగిలిన కొంద‌రు నేత‌ల‌కు గాలం వేసేందుకు...కాంగ్రెస్ ప్ర‌యత్నిస్తోంది. . ఈ క్ర‌మంలోనే టీడీపీ ముఖ్య‌నేత‌లు పార్టీ మార‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో నెంబ‌ర్‌2గా ఓ వెలుగు వెలిగిన దేవేంద‌ర్ గౌడ్ బీజేపీలో చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో...ఆయ‌న్ను కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది.

తెలుగుదేశం పార్టీని వీడిన‌ దేవేందర్‌ గౌడ్ గ‌తంలో తెలంగాణరాష్ట్ర సాధ‌న కోసం న‌వ తెలంగాణ ప్ర‌జాపార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీని పీఆర్పీలో విలీనం చేసిన దేవేందర్‌ గౌడ్ తిరిగి తెదేపాలో చేరి రాజ్య‌స‌భ స‌భ్యుడు కూడా అయ్యారు. టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు ఆయ‌న‌కు పార్టీలో త‌గు స్థానం కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యనేతగా గుర్తించారు. అయితే, త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగియ‌డంతో దేవేంద‌ర్ గౌడ్ ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్యంగా 4 పార్ల‌మెంటు స్థానాల్లో గెలుపొందింది. దీంతో పాటుగా రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యానికి దరిదాపుల్లోకి వ‌చ్చింది. ఇలా అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ వైపు దేవేంద‌ర్‌ గౌడ్ మొగ్గుచూపార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

అయితే, అనూహ్య‌రీతిలో దేవేంద‌ర్‌ గౌడ్‌ ను కాంగ్రెస్ నేత‌లు క‌లిశారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క దేవేంద‌ర్‌ గౌడ్‌ తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా స‌హ‌జంగానే వారిద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయాలు చ‌ర్చకు వ‌చ్చాయి. ఈ భేటీలో దేవేంద‌ర్ గౌడ్‌ ను పార్టీలోకి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, దేవేంద‌ర్‌ గౌడ్ ఇంకా త‌న నిర్ణ‌యం వెలువ‌రించ‌లేద‌ని స‌మాచారం.