Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియ‌ర్ నేత కేఈ శ‌ప‌థం.. క‌ర్నూలు రాజ‌కీయం మారుతుందా?

By:  Tupaki Desk   |   19 Jan 2021 4:30 PM GMT
టీడీపీ సీనియ‌ర్ నేత కేఈ శ‌ప‌థం.. క‌ర్నూలు రాజ‌కీయం మారుతుందా?
X
క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాల్లో కొత్త జోష్ మొద‌లు కానుందా? ఇప్ప‌టి వ‌ర‌కు స్త‌బ్దుగా ఉన్న పాలిటిక్స్ ప‌రుగులు పెట్ట‌ను న్నాయా? అంటే.. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది వివిధ కార‌ణాల‌తో పార్టీకి రాజీనామా చేసిన కేఈ ప్ర‌భాక‌ర్‌.. తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ``నా రాజీనామాను ఇంకా ఆమోదించ‌లేదు. కాబ‌ట్టి నేను మ‌ళ్లీ పార్టీ త‌ర‌ఫున ప‌నిచేస్తా. డోన్ నియోజ‌క‌వ‌ర్గాన్ని పార్టీకి కంచుకోట‌గా మారుస్తా!`` అని కేఈ శ‌ప‌థం చేశారు. గ‌త ఏడాది మార్చి లో పార్టీకి రాజీనామా చేశారు. నిజానికి కేఈ కుటుంబం పార్టీలో దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతోంది.

కేఈ కృష్ణ‌మూర్తితో ప్రారంభ‌మైన ఈ రాజ‌కీయాలు.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కేఈ కృష్ణ‌మూర్తికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం వర‌కు... బ‌లంగా సాగాయి. అదేవిధంగా గ‌త ఎన్నిక‌ల్లో కృష్ణ‌మూర్తి కుమారుడు శ్యాంబాబుకు ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ఇచ్చారు. ఇక‌, కేఈ ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. ఇదిలావుంటే.. గ‌త ఏడాది రిజైన్ చేసిన ప్ర‌భాక‌ర్‌.. అప్ప‌టి నుంచి మౌనంగా ఉంటున్నారు. తాజాగా మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ప్ర‌భాకర్ తిరిగి తాను యాక్టివ్ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబు పిలుపు మేర‌కు తాను తిరిగి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు

``డోన్ టీడీపీ ఇంచార్జ్‌గా నిమితుడిన‌య్యా. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి డోన్ లేదా ప‌త్తికొండ, ఆలూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ని గెలిపించేందుకు ఎక్క‌డ అవ‌కాశం ఇస్తే.. అక్క‌డ స‌త్తా చాటుతా`` అని ప్ర‌బాక‌ర్ వెల్ల‌డించారు. స్థానిక ఎన్నిక‌ల్లో టికెట్ ల విష‌యంలో కోట్ల కుటుంబంతో ఏర్ప‌డిన విభేదాల‌ను అధిష్టానం స‌ర్దుబాటు చేసింద‌న్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు గెలిచిన ప్ర‌భాక‌ర్‌.. చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే.. 2014 ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో.. చంద్ర‌బాబు ఆయ‌న‌కుఎమ్మెల్సీ గా అవ‌కాశం ఇచ్చారు. ఇదిలావుంటే, ఆది నుంచి కోట్ల కుటుంబంతో ఉన్న విభేదాల నేప‌థ్యంలో ఆ కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకోవడాన్ని కేఈ తీవ్రంగా వ్య‌తిరేకించారు.

ఈ నేప‌థ్యంలోనే మార్చి 2020లో కేఈ ప్ర‌భాక‌ర్ త‌న ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు.. పార్టీకి భ‌విష్య‌త్తు కూడా లేద‌ని తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇదంతా కూడా స్థానిక ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వ‌డంలో జ‌రిగిన తేడానేని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. అంతేకాదు.. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీ త‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని కూడా ప్ర‌భాక‌ర్ దుయ్య‌బ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే తాను పార్టీ మారేందుకు రెడీగా ఉన్నాన‌ని. అయితే.. ఏ పార్టీ అనేది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాన‌ని సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేసి రాజ‌కీయాల‌ను హీటెక్కించారు. అయితే. వైసీపీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాక‌ర్‌కు ఎలాంటి ఆహ్వానం అంద‌లేదు. అదేస‌మ‌యంలో బీజేపీలోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు పిలుపుతో మ‌ళ్లీ టీడీపీలోనే యాక్టివ్ అయ్యేందుకు నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.