Begin typing your search above and press return to search.

ఆవేశం తగ్గించుకోవాలని చంద్రబాబుకు టీడీపీ సీనియర్ల సలహా?

By:  Tupaki Desk   |   19 Sept 2019 12:17 PM IST
ఆవేశం తగ్గించుకోవాలని చంద్రబాబుకు టీడీపీ సీనియర్ల సలహా?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతిగా ఆవేశ పడుతున్న వైనంపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఇప్పటికే వయసు మీద పడింది. ఇలాంటి సమయంలో ఆయన మాటలు చాలా సావధానంగా ఉండాల్సింది. హుందూగా మాట్లాడాల్సింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం పూనకం వచ్చినట్టుగా విరుచుకుపడుతూ ఉంటారు.

ప్రత్యేకించి భాష ప్రయోగం విషయంలో కూడా చంద్రబాబు నాయుడి తీరు సరిగా లేదనేది అంతటా వినిపిస్తున్న మాట. చంద్రబాబు నాయుడు కృతకమైన భాషను - తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. అవసరానికి మించి తీవ్రంగా మాట్లాడుతూ ఉంటాడు.

ఇలాంటి నేపథ్యంలో ఆ తీరు చర్చనీయాంశంగా మారుతూ ఉంది. అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు అసహనంతో ఇలా మాట్లాడుతూ ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. రాజకీయ నేతకు - అందులోనూ సీనియానిరిటీ గురించి చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు ఇలాంటి అసహనం పనికిరాదని విశ్లేషకులు అంటున్నారు.

ఈ విషయాన్ని గమనించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబుకు హితబోధ చేస్తూ ఉన్నారట. అసహనం తగ్గించుకోవాలని - అతిగా ఆవేశ పడవద్దని చంద్రబాబుకు వారు సూచిస్తున్నారట. మరి ఈ విషయం చంద్రబాబుకు అర్థం అవుతుందో కాదో అంటూ కూడా వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారట!