Begin typing your search above and press return to search.

చంద్రబాబు చూపు.. మళ్లీ కమలం వైపు..

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:07 AM GMT
చంద్రబాబు చూపు.. మళ్లీ కమలం వైపు..
X
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు.. ఇప్పుడు ఇదే టాపిక్ తెలుగుదేశం పార్టీలో నడుస్తోందట.. సీనియర్ల అంతర్మథనంతో చంద్రబాబును ఆలోచనలో పడేస్తోందట... 151 సీట్లతో ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలంటే మిత్రకలహాం వీడి స్నేహగీతం ఆలపించాలని చంద్రబాబుపై నేతలు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

టీడీపీకి సంక్షోభాలు కొత్తకాదు.. నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి నేటి వరకు ఎన్నో ఓటములు చవిచూశాయి. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉన్న టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయి 23 సీట్లకే పరిమితం అవ్వడం టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద ఓటమిగా అభివర్ణిస్తున్నారు.

గెలిచిన వైసీపీపై మూడు నెలలకే చంద్రబాబు యుద్ధం ప్రకటించినా లోలోపల మాత్రం పెద్ద చర్చే సాగుతోందట.. 151 సీట్లతో అఖండ ప్రజాబలంతో గెలిచిన వైసీపీపై ఎంత బురద జల్లినా.. విమర్శలు చేసినా వర్కవుట్ కావడం లేదన్న చర్చ పార్టీ సీనియర్లలో సాగుతోందట.. వైసీపీని ఢీకొట్టడం అంత ఈజీ కాదన్న నిర్ధారణకు వచ్చేశారట... వైసీపీ అఖండ విజయం చూసి చాలా మంది టీడీపీ సీనియర్లు మౌన ముద్ర దాలుస్తున్నారు. మరికొందరు ఏకంగా వైసీపీలోనే చేరుతున్నారు. తోట త్రిముర్తులు - జూపూడీ లాంటి వాళ్లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉత్తరాంద్ర నేత గంటా శ్రీనివాసరావు ఊగిసలాటలో ఉన్నారన్న చర్చ సాగుతోంది.

ఇక ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ప్రధానంగా టీడీపీనే టార్గెట్ చేసింది. నలుగురు ఎంపీలను చేర్చుకొని మిగతా వారి కోసం కాచుకు కూర్చుంది. మరికొందరు నేతలను లాగేసి ఏపీలో కాషాయదళం బలపడాలని చూస్తోంది. క్షేత్రస్థాయి నుంచి టీడీపీ క్యాడర్ ను లాగేయాలని పనిగట్టుకుంది.

ఇప్పుడీ పరిణామాలు టీడీపీ అధిష్టానంలో కలవరపాటుకు గురిచేస్తున్నాయట. పార్టీలోని సీనియర్లు అంతా ఇప్పుడు చంద్రబాబు వద్ద ఒకటే కోరుతున్నారట.. బలమైన వైసీపీని దెబ్బకొట్టాలంటే మళ్లీ బీజేపీవైపు చూడాల్సిందేనని కొందరు సీనియర్ల మాట.. ఈ విషయాన్ని కొందరు సీనియర్లు ఇప్పటికే బాబు చెవిలో కూడా చెప్పారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చూపు మళ్లీ కమలం వైపు మళ్లిందనే చర్చ టీడీపీలోనే సాగుతోందట.. తన అనుయాయువు అయిన ఆంధ్రజ్యోతి ఆర్కే అమిత్ షాను కలవడం వెనుక కూడా ఇదే ఉద్దేశం కాబోలు అన్న చర్చ సాగుతోందట..