Begin typing your search above and press return to search.

ఇక‌.. టీడీపీ నిల‌వ‌డం క‌ష్టమే.. సీనియ‌ర్ల టాక్‌..!

By:  Tupaki Desk   |   17 March 2021 4:37 AM GMT
ఇక‌.. టీడీపీ నిల‌వ‌డం క‌ష్టమే.. సీనియ‌ర్ల టాక్‌..!
X
ప్ర‌స్తుతం జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితం.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న టీడీపీ సీనియ‌ర్లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితిలో టీడీపీ వ‌చ్చే మూడేళ్ల వ‌ర‌కు బ‌తికి బ‌ట్ట క‌డుతుందా ? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా వారి మ‌ధ్య చర్చ సాగుతోంది. ప్ర‌ధానంగా చూస్తే.. స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నించింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చ‌విచూసిన ప‌రాజ‌యం నుంచి త‌ట్టుకుని నిల‌బ‌డేందుకు ఈ రెండేళ్ల‌లో జ‌గ‌న్ ప‌రిపాల‌న ద్వారా వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని అనుకుంది. పోనీ సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రిగిన వెంట‌నే స్థానిక ఎన్నిక‌లు రాలేదు. రెండేళ్ల టైం ఉంది... ప్ర‌భుత్వం తీసుకున్న చాలా నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక‌త ఉంది.

జ‌గ‌న్ నిర్ణ‌యాలు ప్ర‌తిప‌క్షాలే కాకుండా మేథావులు సైతం త‌ప్పుప‌ట్టారు. ఈ క్ర‌మంలో చోటా.. మోటా .. నాయ‌కుల‌ను క‌ల‌గ‌లుపుకొని చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. అదే స‌మ‌యంలో పార్టీలోనూ ప‌ద‌వులు ఇచ్చారు. ముఖ్యంగా యువ‌త‌కు టికెట్లు ఇచ్చారు. మ‌హిళ‌ల‌కు ఎక్కువ‌ అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, తానే స్వ‌యంగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా దిగారు. ఇక జ‌గ‌న్ మాత్రం అస‌లు ఈ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. అయినా టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. అదే స‌మ‌యంలో టీడీపీకి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు.. ఓటు బ్యాంకు కూడా పూర్తిగా త‌గ్గిపోయింది. దీనిని చంద్ర‌బాబు లైట్‌తీసుకున్నా.. పార్టీ మ‌ళ్లీ పున‌రుత్తేజం క‌లుగుతుంద‌ని.. ఎవ‌రూ నిరాశ ప‌డ‌వ‌ద్ద‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న జారీ చేసినా..ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌డం లేదు.

ప‌దే ప‌దే చంద్రబాబు ధైర్య ప్ర‌వ‌చ‌నాలు చెపుతున్నారు.. పోరాడండి అని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇస్తున్నా ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ఏ మాత్రం ఆర్థిక‌సాయం చేయ‌క‌పోవ‌డంతో కేడ‌ర్‌ లో.. ఇటు నియోజ‌క‌ వ‌ర్గ స్థాయి నాయ‌కుల్లో నిరాశ అలుముకుంటోంది. బాబు మాటలు చెపుతున్నారే త‌ప్పా సాయం చేయ‌డం లేద‌న్న విష‌య‌మే ఇప్పుడు పార్టీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌మ‌యం రెండున్న‌రేళ్ల‌కు పైగానే ఉంది. ఈ స‌మ‌యం లో నాయ‌కుల‌ను కాపాడు కోవ‌డం టీడీపీ అధినేత‌ కు త‌ల‌కు మించిన భారంగా ఉంది. అదే స‌మ‌యంలో ఆర్థికంగా నాయ‌కులు పుంజుకోక పోతే.. ఇబ్బంది పడాల్సిన అవ‌స‌రం కూడా ఉంటుంది.

ఇక‌, ఈలోగా.. మూడు రాజ‌ధానుల ఏర్పాటు ను వైసీపీ తీవ్రంగా తీసుకుంటుంది. ఇప్ప‌టికే త‌మ‌కు ప్ర‌జామోదం ల‌భించింద‌ని వైసీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విధానం ఒక ఎత్త‌యితే.. రాబోయే రోజుల్లో జ‌ర‌గ‌బోయే ప‌రిస్థితులు మ‌రో ఎత్తుగా పేర్కొంటున్నారు సీనియ‌ర్లు. సో.. మొత్తంగా చూస్తే.. రాబోయే రోజుల్లో టీడీపీ మ‌రింత గడ్డు ప‌రిస్థితి ఎదుర్కొన‌డం తో పాటు.. పార్టీ మూలాల‌కే ఇబ్బందు లు వ‌చ్చే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.